మారుతి గ్రాండ్ విటారాపై రూ. 2 లక్షల వరకు భారీ డిస్కౌంట్

Maruti Grand Vitara: మారుతి లగ్జరీ, ప్రీమియం ఎస్‌యూవీ అయిన గ్రాండ్ విటారాను సెప్టెంబర్‌లో కొనుగోలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కంపెనీ ఈ నెలలో ఈ ఎస్‌యూవీపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అంతేకాకుండా కొత్త జీఎస్టీతో తగ్గే పన్ను ప్రయోజనాలు అదనం. కంపెనీ దాని అన్ని వేరియంట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, అత్యధిక ప్రయోజనం స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌పై లభిస్తుంది. గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా వేరియంట్‌లతో పాటు ఆల్ వీల్ డ్రైవ్ పై కూడా డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.42 లక్షల నుండి రూ. 20.68 లక్షల వరకు ఉన్నాయి. ఈ కారు ఒక్క ఫుల్ ట్యాంక్‌పై 1200 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.

ఆల్-వీల్ డ్రైవ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ట్రిమ్‌లపై రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు, 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ, డొమినియన్ కిట్ కూడా అందుబాటులో ఉన్నాయి. డెల్టా, జెటా, ఆల్ఫా ట్రిమ్‌లపై రూ. 85,000 లేదా క్యాష్+కిట్+వారంటీ ప్రయోజనాలు లభిస్తాయి. సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 35,000 నుండి రూ. 45,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. సిగ్మాపై రూ. 60,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, కస్టమర్‌లకు స్క్రాచ్ కార్డు ద్వారా రూ. 50,000 వరకు గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుంది.

మారుతి సుజుకి, టయోటా కలిసి ఈ హైరైడర్, గ్రాండ్ విటారాలను తయారు చేశాయి. గ్రాండ్ విటారాలో హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. హైబ్రిడ్ కారులో రెండు మోటార్‌లు ఉంటాయి.. ఒకటి పెట్రోల్ ఇంజిన్, రెండవది ఎలక్ట్రిక్ మోటార్. ఈ రెండింటి శక్తిని కారును నడపడానికి ఉపయోగిస్తారు. కారు ఫ్యూయల్ ఇంజిన్‌తో నడుస్తున్నప్పుడు, బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. అవసరమైనప్పుడు ఇది ఎక్స్ ట్రా పవర్ అందిస్తుంది.

ఈవీ మోడ్లో, కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడుస్తుంది. ఇది చాలా సైలెంటుగా ఉంటుంది. హైబ్రిడ్ మోడ్‌లో, కారు ఇంజిన్ ఎలక్ట్రిక్ జనరేటర్‌లా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ కారు వీల్స్ నడుపుతుంది. గ్రాండ్ విటారాలో టచ్​స్క్రీన్​, ట్రైర్ ప్రెజర్ చెకింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్ఈ, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, సీట్ బెల్ట్, పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story