2027 నాటికి రోడ్లపై హైబ్రిడ్ కార్ల జాతర

Hybrid SUVs : భారతదేశ ఆటోమొబైల్ రంగం రాబోయే రెండేళ్లలో భారీ మార్పులకు లోనుకానుంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ లేదా హ్యాబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి దిగ్గజ సంస్థలు తమ బెస్ట్ సెల్లింగ్ కార్లను సరికొత్త హైబ్రిడ్ అవతారంలోకి మార్చేస్తున్నాయి.

మారుతి బలెనో

మారుతి సుజుకి తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బలెనో కొత్త జనరేషన్ మోడల్‌ను 2027 నాటికి లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మారుతి సొంతంగా అభివృద్ధి చేసిన సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ సిస్టమ్‌లో పెట్రోల్ ఇంజిన్ కేవలం బ్యాటరీని ఛార్జ్ చేసే జనరేటర్‌లా పనిచేస్తుంది, కారు చక్రాలు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా తిరుగుతాయి. దీనివల్ల బలెనో లీటరుకు సుమారు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా

భారతదేశపు ఫేవరెట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా 3వ జనరేషన్ మోడల్ (కోడ్‌నేమ్: SX3) 2027లో మార్కెట్లోకి రానుంది. ఇది ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే పెద్దదిగా, గంభీరంగా ఉండబోతోంది. మొదటిసారిగా ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టనున్నారు. లీటరుకు 25-30 కి.మీ మైలేజీతో పాటు, డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, లెవల్-2 ఏడీఏఎస్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.

టాటా నెక్సాన్ గరుడా

టాటా మోటార్స్ తన నెక్సాన్ తర్వాతి జనరేషన్‌ను గరుడ అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తోంది. 2027లో విడుదలయ్యే ఈ కారు డిజైన్ పూర్తిగా మారిపోనుంది. ఇది టాటా వారి లేటెస్ట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాంగ్వేజ్‌తో రానుంది. అయితే, రాబోయే కఠినమైన బీఎస్7 ఉద్గార నిబంధనల కారణంగా ఇందులో డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేసి, కేవలం టర్బో పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వేరియంట్లను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది.

మహీంద్రా XUV 3XO

మహీంద్రా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ XUV 3XO తర్వాతి వెర్షన్‌ను విజన్ ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తోంది. ఇది కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతుంది. 2027-28 నాటికి విడుదలయ్యే ఈ కారులో మహీంద్రా తొలిసారిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చూస్తోంది. జెట్ ఫైటర్ లాంటి ఫ్రంట్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్‌తో ఇది యువతను ఆకట్టుకోనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story