వెర్నా, క్రెటా ఈవీలపై రూ. 1.10 లక్షల వరకు భారీ తగ్గింపు

Hyundai : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ నెల మీకు అదిరిపోయే అవకాశాన్ని ఇస్తోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తన పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్‌యూవీలతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై కూడా లక్షల్లో ఆఫర్లు ఇస్తోంది. ఈ ఏప్రిల్ 2026 ఆఫర్ల ద్వారా కస్టమర్లు ఏకంగా రూ.1.10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

హ్యుందాయ్ వెర్నా

ఈ నెలలో అత్యధికంగా లాభం పొందే కారు హ్యుందాయ్ వెర్నా. పాత స్టాక్ ఉన్న వెర్నా iVT ట్రిమ్స్‌పై ఏకంగా రూ. 1.10 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 160 పీఎస్ పవర్ ఇచ్చే ఈ సెడాన్, తన సెగ్మెంట్‌లో అత్యంత పవర్‌ఫుల్ కారుగా పేరు తెచ్చుకుంది. లగ్జరీ మరియు పవర్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ టైమ్.

హ్యుందాయ్ క్రెటా ఈవీ

ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారాలనుకునే వారికి హ్యుందాయ్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌పై ఏకంగా రూ.లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సపోర్ట్, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిసి ఉన్నాయి. ఇక పెట్రోల్ క్రెటా,ఎన్ లైన్ వేరియంట్లపై రూ. 55,000 వరకు తగ్గింపు ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ & ఆరా

సిటీ రైడింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన గ్రాండ్ i10 నియోస్ టాప్ వేరియంట్లపై రూ.68,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక కాంపాక్ట్ సెడాన్ ఆరా పై ఈ నెలలో రూ. 20,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

హ్యుందాయ్ i20

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ i20, దాని స్పోర్టీ వెర్షన్ N Line పై కంపెనీ రూ. 58,000 వరకు ఆఫర్లు ఇస్తోంది. ముఖ్యంగా ఆస్టా, స్పోర్ట్జ్ వేరియంట్లను కొనేవారికి ప్రైస్ గ్యాప్ తగ్గడం వల్ల మంచి లాభం చేకూరుతుంది.

హ్యుందాయ్ ఎక్స్టర్ & వెన్యూ

హ్యుందాయ్ యొక్క చిన్న ఎస్‌యూవీ ఎక్స్టర్ పాత స్టాక్‌పై రూ.43,000 వరకు ఆఫర్ ఉంది, కొత్త మోడళ్లపై మాత్రం ఇది రూ.5,000 గానే ఉంది. ఇక బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ పై ఏప్రిల్ నెలలో రూ.5,000 వరకు స్వల్ప తగ్గింపు మాత్రమే లభిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story