Hyundai Bayon: మార్కెట్‌ను షేక్ చేయడానికి వచ్చేసిన హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ
హ్యుందాయ్ కొత్త ఎస్యూవీ

Hyundai Bayon: భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా మరో సంచలన వాహనాన్ని విడుదల చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ బేయాన్ ఎస్‌యూవీని కేవలం రూ.9.99 లక్షల ధరతో లాంచ్ చేశారు. క్రెటా కంటే చిన్నదిగా, వెన్యూ కంటే పెద్దదిగా రూపొందించిన ఈ సరికొత్త కారు భారతీయ గడ్డపై తయారై ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది. దేశీయ మార్కెట్లో ఇది మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మొత్తం 7 వేరియంట్లలో లభించే ఈ వాహనంలో జనవరి 2027 నాటికి ప్రత్యేక సీఎన్‌జీ మోడల్ కూడా అందుబాటులోకి రానుంది.
ఈ ఎస్‌యూవీలో అత్యంత పవర్ఫుల్ 1,497 సీసీ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 115 పీఎస్ పవర్ అలాగే 143.8 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఐవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్రత్యేకంగా డాష్ బూస్ట్ మోడ్ ఇవ్వడం ద్వారా ఓవర్‌టేక్ చేసే సమయంలో అద్భుతమైన పర్ఫెక్స్‌ను ఇస్తుంది. అంతేకాకుండా ఇకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌లతో పాటు ప్యాడల్ షిఫ్టర్లు, ఐడిల్ స్టాప్ అండ్ గో ఫీచర్ వంటి మోడ్రన్ ఫెసిలిటీలు ఉన్నాయి.
కారు బాహ్య రూపం చాలా ఆకర్షణీయంగా ఉంది. హెచ్-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 17 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌తో పాటు 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకత. కేబిన్ లోపల రెండు 12.3 అంగుళాల స్క్రీన్లతో కూడిన పానోరమిక్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో పెర్‌ప్లెక్సిటీ అలాగే సౌండ్‌హౌండ్ ఏఐ టెక్నాలజీతో కూడిన జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ పొందుపరిచారు. వాతావరణం, వార్తలు, ఆటలకు సంబంధించిన సమాచారాన్ని వాయిస్ కమాండ్ ద్వారా తెలుసుకోవచ్చు. బోస్ సౌండ్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ దీని లగ్జరీని మరింత పెంచుతాయి.
ప్రయాణికుల భద్రతకు హ్యుందాయ్ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ సహా 35 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తాయి. హైటెక్ వేరియంట్లలో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ప్రో ఏడీఏఎస్ టెక్నాలజీని అందించారు. దీని ద్వారా 23 డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి. ఇక కుటుంబంతో ప్రయాణించే వారికి 505 లీటర్ల భారీ బూట్ స్పేస్, వెంటిలేటెడ్ సీట్లు, వెనుక ఏసీ వెంట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

