Hyundai Creta : రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఇంటికి తెచ్చుకోండి.. నెలకు ఎంత కట్టాలంటే ?
నెలకు ఎంత కట్టాలంటే ?

Hyundai Creta : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవీ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా ఎలక్ట్రి ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. మంచి ఫీచర్లు, పర్ఫార్మెన్స్, స్టైల్‌తో కూడిన ఈ కారును ఈజీ ఫైనాన్స్ స్కీమ్‌ల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి క్రెటా ఎలక్ట్రిక్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ బేస్ వేరియంట్ ధరలు, ఆన్-రోడ్ ఖర్చుల వివరాలను తెలుసుకుందాం. వివిధ వేరియంట్‌లు వేర్వేరు ఫీచర్లతో రూ.18.02 లక్షల నుంచి రూ.24.55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉన్నాయి.
* క్రెటా ఎలక్ట్రిక్ ఎక్స్ షోరూం ధర రూ.18,02,200.
* ఆర్టీఓ ఛార్జ్: రూ.14,080
* ఇన్సూరెన్స్: రూ.98,100
* ఇతర ఖర్చులు: రూ.18,822
* మొత్తం ఆన్-రోడ్ ధర : రూ.19,33,202
ఒకవేళ మీరు క్రెటా ఎలక్ట్రిక్ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ గా రూ.2,00,000లు చెల్లిస్తే, లోన్ తీసుకోవాల్సిన మొత్తం రూ.17,33,202. మీరు తీసుకున్న లోన్ మొత్తంపై, 7 సంవత్సరాల కాలానికి (84 నెలలు), 10% వడ్డీ రేటుతో ఈఎంఐ, వడ్డీని లెక్కిస్తారు.
* లోన్ కాలపరిమితి: 7 సంవత్సరాలు (84 నెలలు)
* వడ్డీ రేటు (అంచనా): 10% (సంవత్సరానికి)
* నెలవారీ ఈఎంఐ : సుమారు రూ.28,773
* 7 సంవత్సరాల కాలంలో మీరు వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం సుమారు రూ.6,83,747
* మీరు చెల్లించే మొత్తం (కారు అసలు ధర + వడ్డీ): రూ.17,33,202 + రూ.6,83,747 = రూ.24,16,949
* కారు మొత్తం ఖర్చు (డౌన్ పేమెంట్ + మొత్తం లోన్ మొత్తం): రూ.2,00,000 + రూ.24,16,949 = రూ.26,16,949
మీరు నెలవారీ వాయిదాలు లేదా వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు డౌన్ పేమెంట్ మొత్తాన్ని పెంచడం ద్వారా లోన్ తీసుకోవాల్సిన మొత్తం తగ్గుతుంది. దీని ద్వారా మీ నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. లోన్ కాలపరిమితి (7 సంవత్సరాలు) తగ్గించడం ద్వారా ప్రతి నెలా ఈఎంఐ పెరుగుతుంది. కానీ మొత్తం వడ్డీ చాలా తగ్గుతుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు లోన్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే చెల్లించడం ద్వారా వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఫీచర్లు, పర్ఫార్మెన్స్, స్టైల్‌లో అద్భుతమైన ఆప్షన్. పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో కూడిన కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి డీల్ అవుతుంది.

