Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్..2027లో అదిరే ఫీచర్‌తో లాంచ్
2027లో అదిరే ఫీచర్‌తో లాంచ్

Hyundai Exter : హ్యుందాయ్ ఇండియా తన కస్టమర్‌ల కోసం ఒక పెద్ద అప్‌డేట్‌ను తీసుకురాబోతోంది. త్వరలో రాబోయే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్‌లో తన నెక్స్ట్-జెనరేషన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తామని కంపెనీ ధృవీకరించింది. ఈ అప్‌డేటెడ్ మోడల్ 2027 ప్రారంభంలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కేవలం టెక్నికల్ మార్పులు మాత్రమే కాకుండా, కారు లోపలి ఫీచర్లు, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి.
కొత్త ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ కంపెనీ యొక్క మొదటి ఏ+ సెగ్మెంట్ ఎస్‌యూవీ అవుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ లభిస్తుంది. ఈ సిస్టమ్‌లో రెండు పెద్ద డిజిటల్ స్క్రీన్‌లు ఉంటాయి. ఒకటి 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, మరొకటి 9.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ రెండు స్క్రీన్‌లు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో ఓఎస్ పై పని చేస్తాయి. దీనితో ఎక్స్‌టర్ భారతదేశంలో పూర్తిగా గూగుల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌పై ఆధారపడే మొదటి మాస్-మార్కెట్ కారుగా నిలుస్తుంది.
ఇప్పటివరకు ఈ టెక్నాలజీ వోల్వో వంటి లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించేది.. కానీ హ్యుందాయ్ ఇప్పుడు దీనిని సాధారణ కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త సిస్టమ్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ల ద్వారా తన సాఫ్ట్‌వేర్, మ్యాప్‌లను స్వయంగా అప్‌డేట్ చేసుకోగలదు. అంతేకాకుండా, ఇందులో స్ట్రీమింగ్, మ్యూజిక్, నావిగేషన్ సర్వీసులు వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని గతంలో కంటే మరింత స్మార్ట్‌గా మారుస్తుంది.
ఇన్ఫోటైన్‌మెంట్ అప్‌గ్రేడ్‌తో పాటు, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో కూడా అనేక అప్ డేట్స్ చేసింది. కొత్త సీట్ అప్‌హోల్‌స్ట్రీ, మెరుగైన క్వాలిటీ గల క్యాబిన్ మెటీరియల్, కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లతో క్యాబిన్ ఇప్పుడు మరింత ప్రీమియంగా ఉంటుంది. అయితే, క్యాబిన్ బేసిక్ డిజైన్ స్ట్రక్చర్ పెద్దగా మారదని కంపెనీ స్పష్టం చేసింది.
హ్యుందాయ్ ఇంకా ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ లుక్‌కు సంబంధించిన ఏ ఫోటోలను లేదా టీజర్‌లను విడుదల చేయలేదు. అయితే, దీని డిజైన్ హ్యుందాయ్ కొత్త జనరేషన్ కార్లైన వెన్యూ నుండి ప్రేరణ పొంది ఉంటుందని అంచనా. ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ ప్రస్తుత సెటప్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 1.2-లీటర్ 83హెచ్‌పీ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ రెండు ఆప్షన్లలో వస్తుంది. అదనంగా 69హెచ్‌పీ సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా అందించవచ్చు, ఇది ప్రస్తుతం కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫేస్‌లిఫ్ట్ స్పెషాలిటీ దాని ఆండ్రాయిడ్ ఆటో ఓఎస్ పై పనిచేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. రెండు పెద్ద డిజిటల్ స్క్రీన్‌లు, ఓటీఏ అప్‌డేట్‌ల సౌకర్యం, థర్డ్-పార్టీ యాప్ ఇంటిగ్రేషన్ దీనిని ఒక టెక్-సెంట్రలైజ్డ్ కారుగా మారుస్తాయి.
