ఏకంగా రూ.55వేల డిస్కౌంట్.. త్వరపడండి

Hyundai Exter : టాటా పంచ్ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై ఏకంగా రూ.55,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇది వినియోగదారులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది టాటా పంచ్ వంటి ప్రజాదరణ పొందిన వాహనాలకు గట్టి పోటీనిస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ అమ్మకాలను పెంచడానికి భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూన్ నెలలో హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.5.99 లక్షల నుండి రూ.10.43 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది.

డిస్కౌంట్ వివరాలు

ఈ డిస్కౌంట్‌లో నగదు తగ్గింపు (cash discount), ఎక్స్ఛేంజ్ తగ్గింపు, స్క్రాపేజ్ బోనస్ వంటి ఆఫర్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్‌లకు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయి. అలాగే, ఈ బెనిఫిట్స్ వివిధ నగరాల్లో వేర్వేరుగా ఉండవచ్చు. ఈ ఆఫర్‌లను పొందాలనుకుంటే దగ్గర్లోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 82 bhp పవర్, 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎమ్‌టి (AMT) ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 68 bhp పవర్ , 95.2 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో డ్యూయల్-సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సీఎన్‌జీ కిట్ ఉన్నప్పటికీ అద్భుతమైన బూట్ స్పేస్ లభిస్తుంది. ఇది చాలా మందికి పెద్ద ప్లస్ పాయింట్.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ డిజైన్

డిజైన్ పరంగా, ఎక్స్‌టర్ చాలా లేటెస్ట్ బోల్డ్ లుక్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్ పెద్దది. ఆకర్షణీయంగా ఉంటుంది. H-షేప్ DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు దీనికి ఎస్‌యూవీ లాంటి లుక్ ఇస్తాయి. బాడీపై క్లాడింగ్, రూఫ్ రెయిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ దీని స్టైల్‌ను మరింత మెరుగుపరుస్తాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్లు

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎక్స్‌టర్ క్యాబిన్ ప్రీమియం ఫీల్‌ను ఇస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో ఏసీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఎక్స్‌టర్‌లో వాయిస్-ఎనేబుల్డ్ సన్‌రూఫ్, డ్యాష్‌క్యామ్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ సేఫ్టీ

సేఫ్టీ పరంగా ఎక్స్‌టర్ చాలా ముందంజలో ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించబడ్డాయి. అలాగే, ఈఎస్‌పీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ , రియర్ పార్కింగ్ కెమెరా (Rear Parking Camera), ఎస్‌ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక స్టైలిష్, ఫీచర్-రిచ్, సేఫ్టీ మైక్రో ఎస్‌యూవీ. తక్కువ ధరలో ఎస్‌యూవీ ఎక్స్ పీరియన్స్ కోరుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్గా నిలిచింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story