Hyundai : హ్యుందాయ్ ధమాకా ఆఫర్.. క్రెటా, వెన్యూ కార్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్ అవ్వకండి
క్రెటా, వెన్యూ కార్లపై భారీ డిస్కౌంట్లు.. మిస్ అవ్వకండి

Hyundai : హ్యుందాయ్ కార్ల ప్రేమికులకు ఇది మంచి సమయం. ఫిబ్రవరి 2026 నెలలో హ్యుందాయ్ మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. సాధారణంగా క్రెటా, వెన్యూ వంటి మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల కంపెనీ వీటిపై ఆఫర్లు ఇవ్వడానికి పెద్దగా మొగ్గు చూపదు. కానీ, ఈ నెలలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఎక్స్టర్, క్రెటా, వెన్యూ, ఆరా మోడళ్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తోంది.
హ్యుందాయ్ కార్లపై ఈ నెలలో లభిస్తున్న ఆఫర్లు వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారుతూ ఉంటాయి. ప్రధాన మోడళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
1. హ్యుందాయ్ ఎక్స్టర్ : చిన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తున్న ఎక్స్టర్‌పై ఈ నెలలో అత్యధికంగా రూ.43,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ మరియు ప్రత్యేక ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ కింద రూ.3,000 అదనంగా వస్తాయి. దీని ధరలు రూ.5.64 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.
2. హ్యుందాయ్ ఆరా : మంచి మైలేజీ ఇచ్చే సెడాన్ కారు కావాలనుకునే వారికి ఆరా బెస్ట్ ఆప్షన్. ఈ కారుపై నగదు తగ్గింపు, స్క్రాపేజ్ బోనస్ కలిపి మొత్తం రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మారుతీ డిజైర్, హోండా అమేజ్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తోంది.
3. హ్యుందాయ్ క్రెటా : భారతీయ రోడ్లపై కింగ్‌లా వెలుగుతున్న క్రెటాపై ఈ నెలలో రూ.30,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ప్రధానంగా స్క్రాపేజ్ బోనస్ రూపంలో అందుబాటులో ఉంది. క్రెటా ధర రూ.10.79 లక్షల నుంచి రూ.20.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
4. హ్యుందాయ్ వెన్యూ : కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పాపులర్ అయిన వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ కార్లపై ఈసారి డిస్కౌంట్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి. స్క్రాపేజ్ స్కీమ్ ద్వారా సుమారు రూ.5,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. మార్కెట్లో బ్రెజ్జా, నెక్సాన్ వంటి కార్ల నుంచి దీనికి గట్టి పోటీ ఎదురవుతోంది.

