Hyundai: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారతీయ మార్కెట్లో పండగ సీజన్‌ను పురస్కరించుకుని కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. క్రెటా, ఐ20, వెర్నా, ఆరా వంటి పాపులర్ కార్లపై భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అలాగే అప్‌గ్రేడ్ బెనిఫిట్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా వినియోగదారులు రూ.లక్ష వరకు సులభంగా ఆదా చేసుకోవచ్చు.

క్రెటా అలాగే క్రెటా ఎన్ లైన్ ఆఫర్లు

హ్యుందాయ్ అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీ క్రెటా పెట్రోల్ మోడల్‌పై రూ.35వేల వరకు నగదు ప్రయోజనం లభిస్తోంది. అలాగే స్పోర్టివ్ లుక్ కోరుకునేవారికి క్రెటా ఎన్ లైన్ మోడల్‌పై రూ.45 వేల క్యాష్ బెనిఫిట్, 30వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్, 25 వేల రూపాయల అప్‌గ్రేడ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కలిపి అర్హులైన కస్టమర్లకు దాదాపు లక్ష రూపాయల వరకు లాభం చేకూరుతుంది. ఎలక్ట్రిక్ వేరియంట్లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు ఇస్తున్నారు.

గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా పై డిస్కౌంట్లు

హ్యుందాయ్ చిన్న కార్ల విభాగంలో పేరుగాంచిన గ్రాండ్ ఐ10 నియోస్ పెట్రోల్ వెర్షన్‌పై రూ.35వేలు, సీఎన్‌జీ వెర్షన్‌పై రూ.30వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీనికి అదనంగా 15 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక ఆరా సెడాన్ కారు పెట్రోల్ మోడల్‌పై 15 వేల రూపాయలు, సీఎన్‌జీ మోడల్‌పై రూ.30వేలు నగదు తగ్గింపు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐ20 అలాగే ఎక్స్టర్ కార్లపై తగ్గింపులు

యూత్ ఆకర్షించే హ్యుందాయ్ ఐ20 కారుపై రూ.25వేల క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.15వేల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్టర్ కొనుగోలు చేసే వారికి రూ.20వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10000ల ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆఫర్లు అన్నీ వేరియంట్ల వారీగా మారుతుంటాయి కాబట్టి కొనుగోలుదారులు ముందుగా డీలర్ వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

వెర్నా అలాగే అల్కాజార్ కార్లపై భారీ ప్రయోజనాలు

ప్రీమియం సెడాన్ వెర్నా మోడల్‌పై రూ.40వేల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన అల్కాజార్ పెట్రోల్ మోడల్‌పై రూ.30వేల నగదు తగ్గింపు, రూ.20ల ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రకటిచారు. పండగ సమయంలో కొత్త కారు ఇంటికి తీసుకురావాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. షోరూమ్‌ను సందర్శించే ముందు ఆఫర్ల నిబంధనలను పరిశీలించడం శ్రేయస్కరం.

Next Story