ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Hyundai : టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీనిచ్చేందుకు హ్యుందాయ్ తన కొత్త మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో హ్యుందాయ్ ఇన్‌స్టర్ పేరుతో ఉన్న మోడల్‌ను ఆధారంగా చేసుకుని, భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కారు 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఈ కారును HE1i అనే కోడ్‌నేమ్‌తో రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ఇన్‌స్టర్ పేరుతో పిలిచే ఈ మోడల్, మన దేశంలో కూడా అదే పేరుతో లేదా కొత్త పేరుతో రావచ్చు.

ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని సమాచారం..

స్టాండర్డ్ వెర్షన్: 42kWh బ్యాటరీతో సుమారు 300 కి.మీ రేంజ్ ఇస్తుంది.

లాంగ్ రేంజ్ వెర్షన్: 49kWh బ్యాటరీతో సుమారు 355 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

చార్జింగ్: 120kW DC ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.

హ్యుందాయ్ అంటేనే ఫీచర్ల ఖజానా. ఈ చిన్న కారులో కూడా పెద్ద కార్లలో ఉండే ఎన్నో ప్రీమియం ఫీచర్లను అందించబోతున్నారు. ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదే సైజులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండబోతుంది. సేఫ్టీ కోసం కోసం లెవెల్ 2 ADAS ఫీచర్లు (కొలీజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్), ఇరుకైన సందుల్లో కూడా సులభంగా పార్కింగ్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

ఈ కారు సుమారు 3825 మి.మీ పొడవు ఉంటుంది, ఇది దాదాపు టాటా పంచ్ సైజులోనే ఉంటుంది. దీని బాక్సీ డిజైన్, పిక్సెల్ LED హెడ్ ల్యాంప్స్ దీనికి చాలా మోడ్రన్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి, పార్కింగ్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

హ్యుందాయ్ ఈ కారును తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో తయారు చేయబోతోంది. స్థానికంగా తయారు చేయడం వల్ల ధరను తక్కువగా ఉంచే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం.. దీని ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ఇది నేరుగా టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3లతో పోటీపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story