హ్యుందాయ్ నుంచి కొత్త ఈవీ కార్!

Hyundai : హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన విజన్ 2030 ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ఈవీలు తక్కువ ధరలో ఉంటాయని.. టాటా పంచ్, ఎంజీ విండ్సర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తాయని కంపెని తెలిపింది. హ్యుందాయ్ కంపెనీ రానున్న రోజుల్లో ఎలాంటి ప్లాన్‌లు వేసుకుందో, ఎలాంటి ఈవీలు మార్కెట్లోకి రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఇటీవల నిర్వహించిన సీఈఓ ఇన్వెస్టర్ డేలో తమ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఈవీ భారతదేశంలోని డ్రైవర్ల అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడుతుందని, అంతేకాకుండా లోకల్ సప్లై చైన్ నుంచి కూడా దీనికి ప్రయోజనం ఉంటుందని కంపెని తెలిపింది.

హ్యుందాయ్ ఇప్పటికే మార్కెట్‌లోకి క్రెటా ఎలక్ట్రిక్ వంటి ఈవీని తీసుకొచ్చింది. అయితే, కొత్త ఈవీ మోడల్ మాత్రం మరింత సరసమైన ధరలో, సాధారణ ప్రజల కోసం రూపొందించబడుతుంది. ప్రస్తుతం, టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ వంటి కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. హ్యుందాయ్ ఈ కొత్త ఈవీని అదే సెగ్మెంట్‌లోకి తీసుకొచ్చి, ఎక్కువమంది వినియోగదారులను చేరుకోవాలని చూస్తోంది. ఈ కొత్త ఈవీ 2030 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

విజన్ 2030లో భాగంగా హ్యుందాయ్ భారత్‌ను ఒక ఎగుమతుల కేంద్రంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. అందుకోసం పుణె ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి అదనంగా 2.5 లక్షల యూనిట్లకు పెంచుతుంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా 12 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 55.5 లక్షల వాహనాలను విక్రయించాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో దాదాపు 33 లక్షల వాహనాలు ఎలక్ట్రిక్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ ఈవీలలో 18కి పైగా హైబ్రిడ్ మోడల్స్ కూడా ఉంటాయి. హ్యుందాయ్ మిడ్-సైజ్ పికప్, తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ వంటి కొత్త సెగ్మెంట్లలోకి కూడా ప్రవేశించాలని చూస్తోంది. 2027 నుంచి 966 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఈవీలను కూడా విడుదల చేయాలని కంపెనీ ప్రణాళిక వేస్తోంది. ఈ కార్లు పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్ల మధ్య వారధిగా ఉంటాయి. భారతదేశంతో పాటు, యూరప్‌లో అయోనిక్ 3, చైనాలో ఎలెక్సియో, ఒక కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ వంటి కొత్త ఈవీ మోడల్స్‌పై కూడా హ్యుందాయ్ పనిచేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story