Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూపై బంపర్ డిస్కౌంట్.. కొద్ది రోజులు మాత్రమే
కొద్ది రోజులు మాత్రమే

Hyundai Venue : కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ ఒక గుడ్‌న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ ఆగస్టు 2025 కోసం తమ కార్లపై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈసారి రాఖీ పండుగ సందర్భంగా డీలర్ల ద్వారా కస్టమర్లకు ఈ ప్రత్యేక ఆఫర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆఫర్లలో భాగంగా హ్యుందాయ్ వెన్యూ SUV కారుపై ఏకంగా రూ.85,000 తగ్గింపు అందిస్తున్నారు. గత నెల జూన్‌లో కూడా ఇదే ఆఫర్ ఇచ్చారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షల వరకు ఉంది. డిస్కౌంట్ తర్వాత, బేస్ మోడల్ ధర రూ.8 లక్షల లోపే వస్తుంది.
హ్యుందాయ్ వెన్యూలో చాలా ఇంజిన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉన్నాయి. ఈ ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో వస్తాయి. 1.2 లీటర్ పెట్రోల్ (మాన్యువల్) లీటరుకు 17.52కిమీ మైలేజ్ ఇస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ iMT లీటరుకు 18.07కిమీ, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ DCT (ఆటోమేటిక్) లీటరుకు 18.31కిమీ, 1.5 లీటర్ డీజిల్ (మాన్యువల్) లీటరుకు 23.4 కిమీ మైలేజీ అందిస్తుంది. ఈ అద్భుతమైన మైలేజ్, అలాగే అందుబాటు ధర కారణంగా వెన్యూ SUV చాలామందికి ఫేవరేట్ కారుగా మారింది.
హ్యుందాయ్ వెన్యూ కేవలం ధర, మైలేజ్ విషయంలోనే కాదు, సేఫ్టీ, ఫీచర్లలో కూడా చాలా అప్డేట్ అయింది. ప్రయాణికుల భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), రియర్ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా దీనిలో స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED DRLs, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో కియా సోనెట్, మారుతి బ్రెజా, స్కోడా కుషాక్, మహీంద్రా XUV 3XO వంటి కార్లతో హ్యుందాయ్ వెన్యూ పోటీ పడుతోంది.
