హ్యుందాయ్ వెన్యూ N లైన్ 2025 వచ్చేస్తోంది

Hyundai Venue N Line : హ్యుందాయ్ మోటార్ ఇండియా భారతీయ మార్కెట్‌లో తమ కొత్త వెన్యూ N లైన్ 2025ను ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ప్రత్యేకంగా డ్రైవింగ్‌లో వేగం, స్టైల్, ప్రీమియం అనుభూతిని కోరుకునే వారి కోసం రూపొందించారు. కొత్త వెర్షన్‌లో కంపెనీ డిజైన్, టెక్నాలజీ, ఇంజిన్ మూడు అంశాలలోనూ పెద్ద అప్‌గ్రేడ్‌లు చేసింది. దీని వలన ఈ ఎస్‌యూవీ మునుపటి కంటే మరింత అడ్వాన్సుడ్‎గా మారింది.

కొత్త వెన్యూ N లైన్ పర్ఫార్మెన్స్ ప్రేరిత డిజైన్ ల్యాంగ్వేజీలో తయారు చేశారు. ఎస్‌యూవీ ముందు భాగంలో డార్క్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, LED సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, రెడ్ బ్రేక్ కాలిపర్‌లు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. దీనితో పాటు R17 డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ సిస్టమ్, N లైన్ ఎక్స్‌క్లూజివ్ వింగ్ స్పాయిలర్ వంటి అంశాలు దీని డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. కలర్స్ విషయంలో వెన్యూ N లైన్ ఐదు మోనో-టోన్, మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

వెన్యూ N లైన్ ఇంటీరియర్ దాని ఎక్స్‌టీరియర్ వలె డైనమిక్‌గా ఉంది. ఇందులో బ్లాక్ ఇంటీరియర్ థీమ్ ఇచ్చారు. దీనిలో రెడ్ యాక్సెంట్లు, N లైన్ బ్రాండింగ్‌ను ఉపయోగించారు. టెక్నాలజీ పరంగా కొత్త వెన్యూ N లైన్ చాలా మోడ్రన్ గా మారింది. ఇందులో 12.3-అంగుళాల ccNC నావిగేషన్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, స్మార్ట్ అరోమా డిఫ్యూజర్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు చేర్చబడ్డాయి.

కొత్త వెన్యూ N లైన్‌లో కప్పా 1.0-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఈ ఇంజిన్ 120 PS పవర్, 172 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఈ ఎస్‌యూవీ సిటీ, హైవే రెండింటిలోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇందులో రెండు ఆప్షన్లు - 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) లభిస్తాయి. డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపరచడానికి ఇందులో డ్రైవ్ మోడ్ సెలెక్టర్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కూడా ఇచ్చారు.

హ్యుందాయ్ వెన్యూ N లైన్‌ను సేఫ్టీ విషయంలో కూడా కంప్లీట్ గా అప్‌గ్రేడ్ చేసింది. ఎస్‌యూవీలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఇచ్చారు8. దీనితో పాటు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి ఫీచర్లు చేర్చారు. ఈ అడ్వాన్సుడ్ సేఫ్టీ సిస్టమ్ ల కారణంగా వెన్యూ N లైన్ తన సెగ్మెంట్లో అత్యంత సురక్షితమైన, టెక్నాలజీ-లోడెడ్ ఎస్‌యూవీగా నిలిచింది. ఆటో నిపుణుల అంచనా ప్రకారం వెన్యూ N లైన్ ధర రూ.12 లక్షల నుండి రూ.14.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story