టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

Hyundai Venue vs Kia Syros : భారతదేశంలో హ్యుందాయ్ తమ కొత్త జనరేషన్ వెన్యూను విడుదల చేసింది. ఇందులో గతంలో కంటే అడ్వాన్సుడ్ ఫీచర్లు, అప్‌డేట్ చేయబడిన డిజైన్ ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త వెన్యూను కియా సైరోస్ K1 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. అయితే రెండింటి డిజైన్ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది. వెన్యూ లుక్ ఎస్‌యూవీ లాగా దృఢంగా, స్టైలిష్‌గా ఉండగా.. సైరోస్ డిజైన్ టాల్‌బాయ్ స్టైల్‌లో ఎక్కువ ఎత్తుగా, కాంపాక్ట్‌గా ఉంటుంది. రెండు కార్ల టాప్ వేరియంట్‌లలో ఏది ఎక్కువ ఫీచర్-రిచ్, వాల్యూ ఫర్ మనీ అనేది చూద్దాం.

ధర, ఇంజిన్ ఆప్షన్లు

కొత్త హ్యుందాయ్ వెన్యూ టాప్ వేరియంట్ HX 10 (టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్, డీజిల్ ఆటోమేటిక్) రెండు ఆప్షన్‌లలో లభిస్తుంది. అదేవిధంగా కియా సైరోస్ టాప్ మోడల్ HTX+ (O) వేరియంట్ కూడా ఈ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌లతో అందుబాటులో ఉంది. రెండు ఎస్‌యూవీలలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లభిస్తుంది. ధరల విషయంలో రెండూ దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, సైరోస్ దాని టాప్ వేరియంట్‌లో కొన్ని అదనపు ఫీచర్ల కారణంగా కొంచెం ఖరీదైనదిగా ఉండవచ్చు.

ఎక్స్టీరియర్‌లో ఏది ముందుంది?

రెండు కార్ల ఎక్స్టీరియర్ డిజైన్, డైమెన్షన్స్ విషయానికి వస్తే, కియా సైరోస్ చిన్న తేడాతో వెన్యూ కంటే పెద్ద ఎస్‌యూవీగా ఉంటుంది. సైరోస్ వీల్‌బేస్ 2,550ఎంఎం, ఇది వెన్యూ కంటే 30ఎంఎం ఎక్కువ పొడవు. దీని ఎత్తు కూడా 15ఎంఎం ఎక్కువ, ఇది వెనుక సీటులో కూర్చున్న వారికి ఎక్కువ హెడ్‌రూమ్ అందిస్తుంది. డిజైన్ పరంగా సైరోస్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. అయితే వెన్యూలో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెన్యూ ఫ్రంట్ గ్రిల్, DRL (డేటైమ్ రన్నింగ్ లైట్స్) డిజైన్ దీనికి ఎక్కువ మస్కులర్, ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తుంది. అయితే సైరోస్ డిజైన్ కొంచెం అర్బన్ ఫీలింగ్‌ను ఇస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్లు!

రెండు ఎస్‌యూవీలు ఫీచర్-ప్యాక్డ్‌గా ఉన్నాయి. ప్రీమియం టెక్నాలజీతో నిండి ఉన్నాయి. వెన్యూలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్‌డ్ డ్రైవర్ సీట్, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అయితే, కియా సైరోస్ వెన్యూతో పోలిస్తే ఎక్కువ ఫీచర్-రిచ్‌గా ఉంది. ఇందులో 5-అంగుళాల ప్రత్యేక AC కంట్రోల్ డిస్‌ప్లే, రేర్ సీట్ బేస్ వెంటిలేషన్, బిల్ట్-ఇన్ ఎయిర్ ప్యూరిఫైయర్, స్లైడింగ్ రేర్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇచ్చారు. ఈ ఫీచర్లు వెన్యూ టాప్ వేరియంట్‌లో లేవు, కాబట్టి సైరోస్ ఇంటీరియర్ ఫీచర్ల విషయంలో ఒక అడుగు ముందుంది.

సేఫ్టీ, డ్రైవింగ్ ఫీచర్లు

సేఫ్టీ విషయంలో రెండు ఎస్‌యూవీలలో దాదాపు ఒకే రకమైన టెక్నాలజీ ఇచ్చారు. రెండింటిలోనూ లెవల్-2 ADAS , ట్రాక్షన్ కంట్రోల్ మోడ్, ప్యాడిల్ షిఫ్టర్లు, డ్రైవ్ మోడ్ సెలెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెన్యూ బిల్డ్ క్వాలిటీ పటిష్టంగా, హై-స్ట్రెంత్ స్టీల్‌తో తయారు చేశారు. అయితే సైరోస్ ఫ్రేమ్ కూడా K1 ప్లాట్‌ఫారమ్ కారణంగా చాలా స్థిరంగా ఉంటుంది. రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రేర్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అవసరమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఫెసిలిటీ, సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తే కియా సైరోస్ టాప్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. ఎస్‌యూవీ లుక్, రోడ్ ప్రెజెన్స్, డ్రైవింగ్ పర్ఫామెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే హ్యుందాయ్ వెన్యూ మంచి ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story