హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది

Hyundai Verna : భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ కార్ల సెగ్మెంట్ ఎప్పుడూ పాపులర్‌గానే ఉంది. ఈ విభాగంలో హ్యుందాయ్ వెర్నా అత్యంత స్టైలిష్, ఫీచర్-లోడెడ్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2006లో లాంచ్ అయినప్పటి నుంచి అనేక అప్‌డేట్‌లు పొందిన వెర్నా, ప్రస్తుతం నాల్గవ జనరేషన్‌లో ఉంది. ఇప్పుడు కంపెనీ 2026 ప్రారంభంలో దీని కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కిన ఈ కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్, డిజైన్, ఫీచర్లకు సంబంధించి అనేక కొత్త సంకేతాలను అందించింది. ఈ అప్‌డేట్‌తో హోండా సిటీ వంటి ప్రత్యర్థులకు వెర్నా గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌లో అనేక మార్పులు చేశారు. టెస్టింగ్ మోడల్ ద్వారా అందిన సమాచారం ప్రకారం..ఈ కారుకు కొత్త బంపర్‌లు, మరింత ఆకర్షణీయమైన లైటింగ్ ఎలిమెంట్‌లు, అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్-ఎండ్ డిజైన్ లభిస్తుంది. వెనుక భాగంలో కూడా మార్పులు చేశారు, ఇది కారుకు మరింత ప్రీమియం లుక్ ను తీసుకువస్తుంది. అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్-ల్యాంప్‌లు, బూట్-లిడ్ స్పాయిలర్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉండవచ్చు. మొత్తం మీద ఈ అప్‌గ్రేడ్‌లు కారును మరింత మోడ్రన్ గా కనిపించేలా చేస్తాయి.

వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్లో అత్యంత ముఖ్యమైన మార్పు కొత్త డ్యుయల్-స్క్రీన్ కర్వ్‌డ్ సెటప్. ఈ డ్యుయల్ స్క్రీన్ సెటప్ హ్యుందాయ్ క్రెటా, వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌లలో కనిపించే ఫీల్‌ను ఇస్తుంది. రెండు స్క్రీన్‌లు సుమారు 10.25 అంగుళాల సైజులో ఉండే అవకాశం ఉంది. కొత్త మోడల్‌లో వెన్యూ కారులో ఉన్నట్లుగా D-కట్ స్టీరింగ్ వీల్ లభిస్తుంది. దీనికి టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్లు ఉంటాయి. కొత్త వెర్నా ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ విషయంలో కూడా అగ్రగామిగా నిలవనుంది. ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అవాయిడెన్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి కీలక ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఈ టెక్నాలజీతో వెర్నా సేఫ్టీ విషయంలో హోండా సిటీ, మారుతి సియాజ్ వంటి కార్ల కంటే మెరుగైన స్థానంలో ఉండొచ్చు. కొత్త వెర్నాలో ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న రెండు శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్లే కొనసాగుతాయి. 1.5-లీటర్ MPi ఇంజిన్ 115PS పవర్, 143.8Nm టార్క్ ఇస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160PS పవర్, 253Nm టార్క్ జనరేట్ చేస్తుంది. టర్బో ఇంజిన్ వెర్నాను ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటిగా నిలుపుతుంది. ఈ రెండు ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా పర్ఫార్మెన్స్‌లో ఎలాంటి రాజీ ఉండదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story