Hyundai Verna: దసరా ధమాకా.. హ్యుందాయ్ వెర్నాపై ఏకంగా రూ.1.05 లక్షల భారీ డిస్కౌంట్
రూ.1.05 లక్షల భారీ డిస్కౌంట్

Hyundai Verna: పండుగ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే వార్త. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ పాపులర్ ప్రీమియం సెడాన్ వెర్నా పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లను ప్రకటించింది. దసరా, నవరాత్రి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కారుపై ఏకంగా రూ.1.05 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉన్న ఈ మోడల్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే అత్యుత్తమ సమయం.
మోడల్ బట్టి డిస్కౌంట్లు
హ్యుందాయ్ వెర్నా ఓల్డ్ ఐవిటి మోడల్ మిగిలి ఉన్న స్టాక్‌పై గరిష్టంగా రూ.1.05 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. నాన్-ఐవిటి వెర్షన్‌పై రూ.80,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇక మార్కెట్లో ఉన్న కొత్త వెర్నాపై కూడా రూ.75,000 వరకు ప్రయోజనాలు పొందే వెసులుబాటు ఉంది. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ప్రత్యేక నవరాత్రి బుకింగ్ బోనస్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ.20,000 స్క్రాపేజ్ ఆఫర్, రూ.15,000 అప్‌గ్రేడ్ బోనస్‌లతో పాటు గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి.
పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్
వెర్నా కారులో రెండు రకాల పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు లభిస్తున్నాయి. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత స్పీడ్ కోరుకునే వారి కోసం 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది ఏకంగా 158 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి, ఐవిటి గేర్‌బాక్స్‌లతో అనుసంధానించారు.
లగ్జరీ ఇంటీరియర్
కార్ లోపల సౌకర్యాల విషయానికి వస్తే ప్రీమియం లెదర్ స్టీరింగ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, స్మార్ట్ ట్రంక్ రిలీజ్, ప్యాడిల్ షిఫ్టర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. 4,535 మిమీ పొడవు కలిగిన ఈ కారులో ఏకంగా 528 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుంది, ఇది సుదీర్ఘ ప్రయాణాల్లో లగేజ్ పెట్టుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది.
ఏడాస్ లెవెల్-2 సేఫ్టీ
హ్యుందాయ్ వెర్నా భద్రత పరంగా రాజీ పడకుండా ఫస్ట్ క్లాస్ సేఫ్టీని అందిస్తోంది. ఇందులో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు గరిష్టంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, 16 ఇంచీల అలాయ్ వీల్స్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ప్రయాణాన్ని అత్యంత సురక్షితంగా మారుస్తాయి.

