మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న బజాజ్ లెజెండ్

Bajaj Pulsar 180 : భారతదేశపు మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ బజాజ్ పల్సర్ నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఒకప్పుడు కుర్రకారును ఊపేసిన బజాజ్ పల్సర్ 180 మళ్ళీ కొత్త అవతారంలో రోడ్లపైకి రాబోతోంది. గతంలో నిలిపివేసిన ఈ మోడల్‌ను, మార్కెట్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా బజాజ్ సంస్థ తిరిగి లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇటీవల ఒక డీలర్‌షిప్ వద్ద ఈ కొత్త బైక్ ప్రత్యక్షమవ్వడంతో, త్వరలోనే ఇది అధికారికంగా మార్కెట్లోకి వస్తుందని స్పష్టమవుతోంది.

షోరూమ్‌లో కనిపించిన కొత్త పల్సర్ 180ని చూస్తుంటే, పల్సర్ పాత ప్రేమికులను ఆకట్టుకునేలా కంపెనీ దీనిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీని లుక్ ఇటీవల అప్‌డేట్ అయిన పల్సర్ 150ని పోలి ఉంది. బ్లాక్ కలర్ బాడీపై రెడ్, గ్రే కలర్ గ్రాఫిక్స్ బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను ఇచ్చాయి. మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్టైలిష్ సైడ్ ప్యానెల్స్, షార్ప్ టెయిల్ సెక్షన్ ఈ బైక్ ప్రత్యేకతలు. వెనుక వైపు 180 బ్యాడ్జింగ్ స్పష్టంగా కనిపిస్తోంది, ఇది పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది.

కొత్త పల్సర్ 180లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక డిస్క్ బ్రేక్, భారీ సైజులో ఉండే బ్లాక్ ఎగ్జాస్ట్ (సైలెన్సర్) ఇచ్చారు. ఈ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి పల్సర్ 220F లాగా ఉండి, బైక్‌కు ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 178.6cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. అయితే, దీనిని ప్రస్తుత కఠినమైన ఎమిషన్ నిబంధనలకు (BS6 Phase 2), E20 ఇంధనానికి అనుగుణంగా అప్‌డేట్ చేశారు. ఇది సుమారు 17 హార్స్‌పవర్, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల రైడింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

బజాజ్ సంస్థ ఈ కొత్త పల్సర్ 180 ధరను పల్సర్ 150, పల్సర్ 220F మధ్యలో ఉంచే అవకాశం ఉంది. అంటే సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. మార్కెట్లోకి రాగానే ఇది నేరుగా టీవీఎస్ అపాచీ RTR 180 కి గట్టి పోటీనిస్తుంది. కొత్త తరం N-సిరీస్ పల్సర్లు నచ్చని వారు, పాత పల్సర్ క్లాసిక్ లుక్ కోరుకునే వారికి ఈ బైక్ ఒక అద్భుతమైన ఛాయిస్ కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story