ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన టాటా మోటార్స్

Tata Harrier EV: భారతదేశం ఆటోమొబైల్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లలో లేని ఫీచర్‌ను ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో, భారీ రేంజ్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు పేరు హారియర్ ఈవీ. లాంచ్‌తోనే దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది.

టాటా మోటార్స్ ఇటీవల హారియర్ ఈవీని విడుదల చేసింది. ఇప్పుడు ఈ కారు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. హారియర్ ఈవీ భారతదేశంలోనే మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ SUV కావడం దీని ప్రత్యేకత. దీంతో ఆఫ్-రోడింగ్ చేసేవారు కూడా ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవచ్చు. దీనిని టాటా మోటార్స్ జూన్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.21.49 లక్షల నుంచి రూ.29.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. హారియర్ ఈవీ అడ్వెంచర్, ఫియర్‌లెస్, ఎంపావర్డ్ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అంతేకాకుండా, ఒక స్పెషల్ స్టీల్త్ ఎడిషన్ కూడా విడుదల చేశారు.

హారియర్ ఈవీని ప్రత్యేకంగా acti.ev+ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది దాని పెట్రోల్/డీజిల్ వెర్షన్ ప్లాట్‌ఫామ్‌కు కొత్త రూపం. దీన్ని ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ కార్ల కోసం అభివృద్ధి చేశారు. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) లేదా క్వాడ్-వీల్ డ్రైవ్ (QWD).. ఈ వెర్షన్‌లో రెండు యాక్సిల్స్‌పై ఒక్కొక్కటి చొప్పున రెండు మోటార్లు ఉంటాయి. ఇది మెరుగైన ట్రాక్షన్, డైనమిక్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

హారియర్ ఈవీలో అనేక ప్రీమియం ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు ఉన్నాయి. ఇందులో కంప్లీట్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హర్మాన్ సహకారంతో డెవలప్ చేసిన ప్రీమియం శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ మెరుగైన సరౌండ్-సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా, 540-డిగ్రీ కెమెరా సిస్టమ్, డిజిటల్ ఐఆర్‌వీఎం, ట్రాన్స్‌పరెంట్ బోనెట్ వ్యూ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్ కారు ముందు భాగం కింద ఉన్న మార్గాన్ని క్లియర్ గా చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ లేదా ఇరుకైన ప్రదేశాలలో నావిగేషన్ కోసం చాలా ఉపయోగపడుతుంది. హారియర్ ఈవీ నాలుగు రంగులలో నైనితాల్ నాక్టర్న్, ఎంపావర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రేలలో అందుబాటులో ఉంది:

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, RWD వేరియంట్ 235 bhp పవర్, 315 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. QWD వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ సెటప్ కారణంగా పవర్ 391 bhp, టార్క్ 504 Nm వరకు పెరుగుతుంది. 65 kWh బ్యాటరీ 538 కి.మీ రేంజ్ ఇస్తుంది. 75 kWh బ్యాటరీ RWD వెర్షన్‌లో 627 కి.మీ రేంజ్, QWD వెర్షన్‌లో 622 కి.మీ రేంజ్ ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story