Affordable Cars : 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 34 కి.మీ. మైలేజ్.. భారతదేశంలో 5లక్షల్లోపు అత్యంత చౌకైన కార్లు ఇవే
భారతదేశంలో 5లక్షల్లోపు అత్యంత చౌకైన కార్లు ఇవే

Affordable Cars : జీఎస్టీ తగ్గింపు తర్వాత భారత మార్కెట్‌లో అనేక కార్ల ధరలు మరింత తగ్గాయి. ముఖ్యంగా రూ. 5 లక్షల లోపు బడ్జెట్‌లో, మెరుగైన మైలేజ్, మంచి ఫీచర్లు, సేఫ్టీ కోరుకునే వినియోగదారుల కోసం ఈ విభాగంలో కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. మారుతి సుజుకి నుంచి రెనాల్ట్ వరకు ఈ ఐదు అత్యంత చౌకైన కార్లు మార్కెట్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయి. ఈ కార్లలో కొన్ని 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో లభిస్తున్నాయి.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మార్కెట్‌లో అత్యంత సరసమైన, చిన్న ఎస్‌యూవీగా ప్రజాదరణ పొందింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర రూ.3.49 లక్షలకు తగ్గింది. ఎస్‌యూవీ లాంటి డిజైన్, 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్‌జీ వెర్షన్ ఏకంగా కిలోకు 33 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మారుతి సుజుకి ఆల్టో K10
మారుతి ఆల్టో K10 భారతదేశంలో అత్యంత ఇష్టపడే చిన్న కార్లలో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలు. కొత్త జనరేషన్‌తో మెరుగైన డిజైన్, మైలేజ్ వచ్చాయి. ఇందులో 1.0-లీటర్ K10B ఇంజిన్ ఉంటుంది. దీని హైయర్ వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల వరకు ఫీచర్లు ఉన్నాయి. సీఎన్‌జీ మోడల్ కిలోకు 33.85 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. పవర్ విండోస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉన్నాయి.
రెనాల్ట్ క్విడ్
ఎస్‌యూవీని పోలి ఉండే డిజైన్ కోరుకునే వారికి రెనాల్ట్ క్విడ్ మంచి ఎంపిక. దీని ధర రూ.4.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 184 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఇది యువతలో బాగా పాపులర్ అయింది. ఇందులో 1.0-లీటర్ ఇంజిన్ ఉంటుంది. దీని మైలేజ్ సుమారు లీటరుకు 22 కి.మీ. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, రియర్ కెమెరా, క్రూజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు లభిస్తాయి.
టాటా టియాగో
బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన కారుగా టాటా టియాగో నిలిచింది. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ప్రారంభ ధర రూ.4.57 లక్షలు. గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్‌లో దీనికి 4-స్టార్ రేటింగ్ లభించింది. ఇందులో 1.2-లీటర్ రేవోట్రాన్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిలోనూ లభిస్తుంది. మైలేజ్ 23 నుంచి 26 కి.మీ./లీటర్ వరకు ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, హార్మాన్ సౌండ్ సిస్టమ్, ఈఎస్‌పీ వంటి ఫీచర్లు ఈ కారును పూర్తి ప్యాకేజీగా మారుస్తాయి.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో అత్యధిక ఇంధన సామర్థ్యం గల కార్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీని ప్రారంభ ధర రూ.4.69 లక్షలు. దీని సీఎన్‌జీ వెర్షన్ దాదాపు 34 కి.మీ./కేజీ మైలేజ్ ఇస్తుంది, అందుకే దీనిని మైలేజ్ క్వీన్ అని పిలుస్తారు. ఇందులో 1.0-లీటర్ ఇంజిన్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

