ఇప్పుడు కొంటే ఆ బైక్‌లపై రూ.55,000 వరకు డిస్కౌంట్

Kawasaki : బెస్ట్ పవర్, స్పీడ్ కోసం ప్రసిద్ధి చెందిన కవాసాకి బైక్‌లను సొంతం చేసుకోవాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. కవాసాకి ఇండియా తమ బ్రాండ్ మోడల్ ఇయర్ 24, మోడల్ ఇయర్ 25 మోడల్స్‌పై స్పెషల్ బెనిఫిట్ వోచర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం నవంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ గడువు తర్వాత ఈ బైక్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ నింజా 500, నింజా 1100SX, నింజా 300, వర్సెస్-ఎక్స్ 300 మోడల్‌లపై అందుబాటులో ఉంది. కేటీఎం, డ్యుకాటి, బీఎండబ్ల్యూ వంటి బైక్‌లకు పోటీ ఇచ్చే ఈ కవాసాకి మోటార్‌సైకిళ్లపై ఎంత డిస్కౌంట్ ఉందో వివరంగా తెలుసుకుందాం.

కవాసాకి నింజా 1100 ఎస్‌ఎక్స్

కావాసకి బైక్‌లలోకెల్లా అత్యధికంగా రూ.55,000 వరకు డిస్కౌంట్ ఈ మోడల్‌పై లభిస్తోంది. ఇందులో 1,099 cc ఇన్లైన్-ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 135 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.42 లక్షలు.

కవాసాకి వర్సెస్-ఎక్స్ 300

వర్సెస్-ఎక్స్ 300 మోడల్ ఇయర్25 మోడల్స్‌పై రూ.25,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 296 cc, ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ మోటార్ ద్వారా 38.8 bhp పవర్, 26 Nm టార్క్‌ను పొందవచ్చు.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.49 లక్షలు.

కవాసాకి నింజా 500

నింజా 500 మోడల్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ వోచర్ల రూపంలో తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ మోటార్‌సైకిల్‌లో 451 cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఇది 9,000 rpm వద్ద 45 bhp పవర్, 6,000 rpm వద్ద 42.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.5.66 లక్షలు.

కవాసాకి నింజా 300

నింజా 300 మోడల్‌పై కేవలం రూ.5,000 వరకు బెనిఫిట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో 296 cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 38.9 bhp పవర్, 26.1 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.17 లక్షలు.

కవాసాకి అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ నవంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి, ఈ బైక్‌లను కొనుగోలు చేయాలనుకునేవారు ధరలు పెరగకముందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story