Kia India: 7-సీటర్ కారు కొనాలనుకునే వారికి బెస్ట్ ఛాన్స్.. కియా ఎస్‌యూవీపై రూ. 1.20 లక్షల డిస్కౌంట్
కియా ఎస్‌యూవీపై రూ. 1.20 లక్షల డిస్కౌంట్

Kia India: ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ఆగస్టు 2026 నెలకు సంబంధించి తమ కార్లపై లభించే డిస్కౌంట్లు, ప్రయోజనాల వివరాలను వెల్లడించింది. కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ కార్ మోడల్ కారెన్స్ క్లావిస్ పై ఈ నెలలో గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, సాధారణ కారెన్స్ MPV మోడల్‌పై కూడా రూ. 35,000 వరకు తగ్గింపు లభిస్తోంది. 7-సీటర్ విభాగంలో మార్కెట్‌లో బలమైన పట్టు ఉన్న ఈ కారు మారుతి XL6, టయోటా రుమియన్, రెనాల్ట్ ట్రైబర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.
కారెన్స్ క్లావిస్‌పై రూ. 1.20 లక్షల వరకు ఆదా
కారెన్స్ క్లావిస్ MY26 మోడల్‌పై మొత్తం రూ. 1.20 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 లాయల్టీ బెనిఫిట్, రూ. 15,000 కార్పొరేట్ ఆఫర్, రూ. 30,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. అలాగే, MY25 మోడల్‌పై రూ. 75,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు లాయల్టీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి (దీనికి కార్పొరేట్ ఆఫర్ వర్తించదు). ప్రత్యేకంగా MY25 టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తోంది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.27 లక్షల నుంచి రూ. 21.67 లక్షల మధ్య ఉంది.
సాధారణ కారెన్స్‌పై రూ. 35,000 తగ్గింపు
మరింత అందుబాటు ధరలో 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం సాధారణ కియా కారెన్స్‌పై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. MY26 మోడల్‌పై రూ. 15,000 వరకు కార్పొరేట్ ఆఫర్, రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తున్నాయి. MY25 మోడల్‌పై కేవలం స్క్రాపేజ్ బెనిఫిట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.02 లక్షల నుంచి రూ. 12.88 లక్షల మధ్య ఉంది.
త్వరలోనే మార్కెట్‌లోకి కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ
పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు కియా కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ మోడల్ కూడా త్వరలోనే భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. పూణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై టెస్టింగ్ సమయంలో ఈ సీఎన్‌జీ మోడల్ ఇటీవల ప్రత్యక్షమైంది. రాబోయే దీపావళి 2026 పండుగ సీజన్ కంటే ముందే ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో సింగిల్ లేదా ట్విన్ సీఎన్‌జీ ట్యాంక్ సెటప్ అందించే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌లోకి వస్తే నేరుగా మారుతి సుజుకి ఎర్టిగా, XL6 సీఎన్‌జీ మోడళ్లకు ప్రధాన పోటీదారుగా నిలుస్తుంది.

