ఏకంగా రూ.1.35లక్షల వరకు తగ్గింపు

Kia India : పండుగ సీజన్ మొదలైంది. ఈ శుభ సమయంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కియా ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2025 నెల కోసం కియా తమ కార్ల పైన రూ.1.35 లక్షల వరకు భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ రూపంలో లభించే ఈ బంపర్ డిస్కౌంట్‌ల వివరాలు, ఏ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

కియా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన కియా సోనెట్ పై కస్టమర్లు రూ.50,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.

ఇక, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా సెల్టోస్ పై కంపెనీ ఏకంగా రూ.85,000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ను కూడా అందిస్తోంది.

కియా నుంచి తాజాగా లాంచ్ అయిన ఎస్‌యూవీ కియా సైరోస్ పై కూడా ఈ పండుగ సీజన్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. సైరోస్ కొనుగోలుపై కస్టమర్లు రూ.లక్ష వరకు భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌లో రూ.35,000 నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 స్క్రాపేజ్ బోనస్, రూ.15,000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

ఎంపీవీ విభాగంలో చూస్తే కొత్తగా వచ్చిన కియా క్లావిస్ పై రూ.85,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, కియా పోర్ట్‌ఫోలియోలోకెల్లా అత్యధిక డిస్కౌంట్ లభిస్తున్న కారు ప్రీమియం ఎంపీవీ కార్నివాల్. ఈ వాహనంపై గరిష్టంగా రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏకంగా రూ.లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కలిసి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story