Electric Scooter : ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్? కినెటిక్ డీఎక్స్ vs బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్
కినెటిక్ డీఎక్స్ vs బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్

Electric Scooter : భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో పోటీ చాలా పెరిగింది. ఈ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన కినిటిక్ డీఎక్స్, ఇప్పటికే ఉన్న బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు తమ ప్రత్యేకమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు స్కూటర్లలో ఏది బెస్ట్ అని తెలుసుకోవాలంటే, వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను వివరంగా తెలుసుకుందాం.
మూడు స్కూటర్ల ధరల విషయానికి వస్తే..
కినిటిక్ డీఎక్స్ : దీని ధర రూ.1.12 లక్షల నుంచి రూ.1.17 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
బజాజ్ చేతక్ : దీని ధర రూ.1.14 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
టీవీఎస్ ఐక్యూబ్ : దీని ధర రూ.1.09 లక్షల నుంచి రూ.1.28 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
ఈ మూడు స్కూటర్ల ధరలు దాదాపు ఒకే రేంజ్‌లో ఉన్నాయి. కాబట్టి, ధరతో పాటు వాటి ఫీచర్లను కూడా పోల్చుకోవడం చాలా ముఖ్యం.
బ్యాటరీ, రేంజ్
కినిటిక్ డీఎక్స్ : ఇందులో 2.6 kWh LFP బ్యాటరీ ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 116 కిలోమీటర్ల దూరం వరకు వెళ్తుంది. దీని ఇంజిన్ 6.4 bhp పవర్ ఇస్తుంది, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలదు.
బజాజ్ చేతక్ : ఈ స్కూటర్‌లో 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కిలోమీటర్లు.
టీవీఎస్ ఐక్యూబ్ : ఇందులో 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 3.5 kWh బ్యాటరీతో ఇది 123 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు. రేంజ్ పరంగా బజాజ్ చేతక్ టాప్‌లో ఉంది, అయితే టాప్ స్పీడ్ పరంగా కినిటిక్ డీఎక్స్ ముందుంది. అధిక వేగం, మంచి పవర్ కోరుకుంటే, కినిటిక్ డీఎక్స్ బెస్ట్ ఆప్షన్. అత్యధిక రేంజ్ కోరుకుంటే, బజాజ్ చేతక్ సరిపోతుంది. రేంజ్, స్పీడ్ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఆప్షన్.
