Honda : బుల్లెట్‌కు పోటీ.. కొత్త హోండా సీబీ350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. అదిరే ఫీచర్లు
కొత్త హోండా సీబీ350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. అదిరే ఫీచర్లు

Honda : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల రాజ్యానికి సవాలు విసురుతూ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మార్కెట్‌లోకి కొత్త హోండా CB350C స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. తమ ప్రీమియం మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ రేంజ్‌ను విస్తరిస్తూ, హోండా ఈ రెట్రో క్రూజర్ బైక్‌ను రూ.2,01,900 (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. ఈ బైక్ అక్టోబర్ 2025 మొదటి వారం నుంచి అన్ని బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం బైక్ బుకింగ్‌లు హోండా అధికారిక వెబ్‌సైట్‌లో లేదా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి.
రూ.2.02 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో, ఈ బైక్ భారత మార్కెట్లో ఇతర మిడ్-కెపాసిటీ క్రూజర్‌లైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, క్లాసిక్ 350 లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. గతంలో Hness పేరుతో విక్రయించబడిన CB350 ప్లాట్‌ఫామ్ ఇప్పుడు CB350C పేరుతో వస్తోంది. స్పెషల్ ఎడిషన్‌లో కొత్త CB350C లోగో, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్, ముందు, వెనుక ఫెండర్‌లపై కొత్త స్ట్రైప్డ్ గ్రాఫిక్స్ ఇవ్వబడ్డాయి. ఇవి బైక్‌కు మరింత రెట్రో-క్రూజర్ రూపాన్ని అందిస్తాయి.
బైక్‌లో క్రూజర్ బైక్‌లకు ఉండే నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ అలాగే ఉంచారు. వెనుక భాగంలో క్రోమ్-ఫినిష్ గ్రాబ్ రైల్, ఎంచుకున్న కలర్ స్కీమ్ ప్రకారం డ్యూయల్ సీట్ (బ్లాక్ లేదా బ్రౌన్) ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు రెండు కొత్త ఆకర్షణీయమైన రంగులైన రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ లోంచి ఎంచుకోవచ్చు. ఈ రంగులు బైక్ క్లాసిక్ అప్పీల్‌ను మరింత పెంచుతాయి.
ఈ స్పెషల్ ఎడిషన్ క్లాసిక్ స్టైలింగ్, ఆధునిక టెక్నాలజీల సమ్మేళనం. ఈ బైక్‌లో డిజిటల్, అనలాగ్ డిస్‌ప్లేల కలయికతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అంతే కాకుండా హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా హెడ్‌సెట్‌తో కనెక్ట్ అయినప్పుడు నావిగేషన్, కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్యూయల్-ఛానల్ ABS, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
CB350C స్పెషల్ ఎడిషన్‌లో Hness CB350లోని 348.36cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 20.78 hp శక్తిని మరియు 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి వస్తుంది. ఈ ఇంజిన్ స్మూత్ పర్ఫామెన్స్, మంచి మైలేజీని అందిస్తుంది. మొత్తంగా Honda CB350C స్పెషల్ ఎడిషన్ దాని క్లాసిక్ రెట్రో లుక్, లేటెస్ట్ ఫీచర్లు, పోటీ ధరతో భారతీయ మిడ్-సైజ్ క్రూజర్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.
