రికార్డు సృష్టించిన మహీంద్రా

Mahindra : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ రంగంలో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన పట్టును బిగిస్తోంది. మహీంద్రా తీసుకొచ్చిన వినూత్న ఎలక్ట్రిక్ SUVలు BE 6, XEV 9e అమ్మకాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు నెలల్లోనే 10,000 యూనిట్ల డెలివరీలను పూర్తి చేయడం ద్వారా మహీంద్రా, టాటాకు గట్టి పోటీనిస్తోంది.

మహీంద్రా తన ఎలక్ట్రిక్ SUVలైన BE 6, XEV 9e డెలివరీలను 2025, మార్చి 20న ప్రారంభించింది. ప్రారంభించిన కేవలం 40 రోజుల్లోనే 6,300 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు ఆ సంఖ్యను కేవలం రెండు నెలల్లోనే 10,000 యూనిట్లకు పెంచినట్లు మహీంద్రా వెల్లడించింది. టాటా మోటార్స్ ఇటీవల తన హారియర్ ఈవీని విడుదల చేసిన నేపథ్యంలో మహీంద్రా ఈ ఘనతను సాధించడం విశేషం.

ఏప్రిల్ నెలలో 3,000 యూనిట్ల ఈవీ SUVలు డెలివరీ చేసినట్లు మహీంద్రా తెలిపింది. ఈ బుకింగ్స్‌లో 59శాతం ఫ్లాగ్‌షిప్ XEV 9e కాగా, మిగిలిన 41శాతం BE 6 మోడల్స్‌కు సంబంధించినవి. అంతేకాకుండా, ఎక్కువ మంది కస్టమర్‌లు టాప్ మోడల్ 'ప్యాక్ త్రీ' ను ఎంచుకున్నారు. ఇది ఈ మోడల్‌లకు ఉన్న అధిక డిమాండ్‌ను సూచిస్తుంది. మహీంద్రా BE 6, XEV 9e రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 59 kWh బ్యాటరీలో పవర్ అవుట్‌పుట్ 228 bhp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కి.మీ. రేంజ్ ఇస్తుంది.

79 kWh బ్యాటరీ ఆప్షన్లలో 281.6 bhp పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. 380 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే XEV 9e రేంజ్ 656 కి.మీ., BE 6 రేంజ్: 683 కి.మీ. అందిస్తుంది. XEV 9e ధర రూ.22.65 లక్షల నుండి రూ.31.25 లక్షల వరకు, BE 6 ధర రూ.19.65 లక్షల నుంచి రూ.27.65 లక్షల వరకు ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story