Mahindra : మహీంద్రా, ఓలా నుంచి కొత్త ఈవీలు.. AI ఫీచర్లు, అదిరిపోయే ప్లానింగ్!
AI ఫీచర్లు, అదిరిపోయే ప్లానింగ్!

Mahindra : భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మహీంద్రా, ఓలా దేశ ప్రజలకు సరికొత్త ఆవిష్కరణలతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో తమదైన ముద్ర వేయడానికి ఈ రెండు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఫ్యూచర్ డిజైన్‌లు, అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, అడ్వాన్సుడ్ ఈవీ ప్లాట్‌ఫారమ్‌లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్‌యూవీలను నేడు పరిచయం చేయబోతున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్, ఆగస్టు 15, 2025న తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న తమ గిగాఫ్యాక్టరీలో వార్షిక ఈవెంట్ సంకల్ప్ 2025ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో ఒక కొత్త స్పోర్ట్స్ స్కూటర్‌ను పరిచయం చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ స్పోర్టీ మోడల్‌తో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. ఒక టీజర్‌లో ఈ స్కూటర్ గట్టి డిజైన్‌తో, గ్రాబ్ రైల్, ఒకే పీస్ ఫ్లాట్ సీట్‌తో ఆకట్టుకుంటోంది.
ఇంకా, ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ల కోసం MoveOS 6 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లో AI చాట్‌బాట్, వాయిస్ అసిస్టెంట్, ప్రెడిక్టివ్ సర్వీస్ ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. గతేడాది విడుదలైన MoveOS 5 తర్వాత ఇది ఒక పెద్ద అప్‌డేట్.
ఓలా ఎలక్ట్రిక్ తన మూన్‌షాట్ ప్రాజెక్ట్‌లో భాగంగా డైమండ్ హెడ్ అనే మోటార్‌సైకిల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. దీనిని కూడా సంకల్ప్ 2025 కార్యక్రమంలోనే ఆవిష్కరిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం తమ ఇండియా ఇన్సైడ్ విజన్‌ను ఈ ఈవెంట్‌లో వివరించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.
మహీంద్రా సంస్థ కూడా వెనుకబడలేదు. ఆగస్టు 15, 2025న ముంబైలో జరగనున్న Freedom_NU ఈవెంట్‌లో విజన్ T కాన్సెప్ట్ SUVని ప్రవేశపెట్టనుంది. టీజర్ ప్రకారం, ఇది థార్ ఎలక్ట్రిక్ SUVకి దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వెర్షన్. ఇందులో చదరపు ఆకారపు బోనెట్, పవర్ఫుల్ వీల్ ఆర్చెస్, ఆల్-టెర్రైన్ టైర్లు ఉంటాయి. ఇది డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో కూడిన INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.
మహీంద్రా ఇదే ఈవెంట్‌లో విజన్ S, విజన్ SXT కాన్సెప్ట్ మోడళ్లను కూడా ప్రదర్శించనుంది. విజన్ S అనేది స్కార్పియో N ఆధారిత ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ కావచ్చు. ఇక విజన్ SXT కూడా స్కార్పియో N ఆధారిత ఒక పికప్ ట్రక్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్స్‌లో బాక్సీ డిజైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, క్లామ్‌షెల్ హుడ్ వంటి ఆఫ్-రోడ్ అంశాలు కనిపిస్తున్నాయి.
