Mahindra : సింగిల్ ఛార్జ్‌తో 683 కి.మీ.. మహీంద్రా BE 6 బ్యాచ్‌మెన్ ఎడిషన్డె లివరీలు షురూ
మహీంద్రా BE 6 బ్యాచ్‌మెన్ ఎడిషన్డె లివరీలు షురూ

Mahindra : ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని మహీంద్రా సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అత్యంత ప్రత్యేకమైన BE 6 బ్యాట్‌మెన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కలెక్టర్ ఎడిషన్ కారు డెలివరీలను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. వాస్తవానికి, దీని డెలివరీలను సెప్టెంబర్ 20న అంతర్జాతీయ బ్యాట్‌మ్యాన్ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని భావించినప్పటికీ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. మొదట ఈ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే, వినియోగదారుల నుంచి వచ్చిన అద్భుతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ సంఖ్యను 999 యూనిట్లకు పెంచింది. ఈ కలెక్టర్ ఎడిషన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.27.79 లక్షలు. ఇది సాధారణ టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్ కంటే దాదాపు రూ.89,000 అధికం.
మహీంద్రా BE 6 బ్యాట్‌మెన్ ఎడిషన్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇది ది డార్క్ నైట్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. కారు బాడీ అంతా కస్టమ్ సాటిన్ బ్లాక్ ఫినిష్‌తో ఉంటుంది. ఇది కారుకు ప్రీమియం, అత్యంత పవర్ఫుల్ లుక్ ఇస్తుంది. ఆల్కెమీ గోల్డ్ రంగులో పెయింట్ చేయబడిన సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్స్, బ్యాక్ బ్లాక్ ఫినిష్‌తో కాంట్రాస్ట్ అవుతూ స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి.
20-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్, ముందు డోర్‌లపై కస్టమ్ బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, వెనుక భాగంలో BE 6 × The Dark Knight బ్యాడ్జింగ్ ఈ కారుకు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఈ కారు కేవలం వాహనం మాత్రమే కాదు, ఒక కలెక్టర్ ప్రైడ్గా చెప్పవచ్చు. కారు ఇంటీరియర్ కూడా ఎక్స్‌టీరియర్ మాదిరిగానే చాలా ప్రత్యేకంగా ఉంది. ఇందులో చార్‌కోల్ లెదర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, గోల్డ్ సెపియా స్టిచ్చింగ్ తో కూడిన సూడ్ లెదర్ అప్‌హోల్‌స్ట్రీ, గోల్డ్ ఎక్సెంట్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్, ఇన్-టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్‌పై కూడా గోల్డ్ డీటైలింగ్ లభిస్తుంది. సీట్లు, బూస్ట్ బటన్, ఇతర ఇంటీరియర్ భాగాలపై బ్యాచ్ సైన్ ముద్రించి ఉంటుంది.
కారు ఆన్ చేసిన వెంటనే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై బ్యాచ్‌మ్యాన్ వెల్‌కమ్ యానిమేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా, కారు ఎక్స్‌టీరియర్ సౌండ్ ప్రొఫైల్ కూడా బ్యాచ్‌మ్యాన్ థీమ్ ఆధారంగా ఉంటుంది. మహీంద్రా BE 6 బ్యాట్‌మెన్ ఎడిషన్ 79 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, ఈ కారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 683 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఏసీ ఆన్‌లో ఉన్నప్పటికీ, ఈ కారు వాస్తవ పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం సులభంగా ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఎడిషన్ కేవలం డిజైన్, థీమ్ కారణంగానే కాకుండా పనితీరు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది.
