ఆగస్ట్ 15న కొత్త మహీంద్రా బొలెరో కాన్సెప్ట్ వెర్షన్ ఆవిష్కరణ

Mahindra Bolero : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యుటిలిటీ వాహనాలలో ఒకటైన మహీంద్రా బొలెరో ఇప్పుడు కొత్త మోడల్‌లో రాబోతోంది. ఈ విషయంపై మహీంద్రా కంపెనీ పని చేస్తోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం, కొత్త మహీంద్రా బొలెరో కంపెనీ సరికొత్త మోనోకాక్ ప్లాట్‌ఫామ్ పై నిర్మించబడుతుంది. ఈ ఛాసిస్ లో బాడీ లోపలి భాగం, ఫ్రేమ్ ఒకే నిర్మాణంలో కలిసి ఉంటాయి. దీనివల్ల డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్, వెహికల్ హ్యాండ్లింగ్, ఎఫిషియెన్సీ మెరుగుపడతాయి.

కొత్త జనరేషన్ మహీంద్రా బొలెరో టెస్ట్ వెర్షన్‌ల (Test Mules) ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఎస్‌యూవీ (SUV) లేటెస్ట్ డిజైన్, పాత బాక్సీ (Boxy) లుక్ కలయికతో ఉండబోతోంది. కొత్త బొలెరోను ఆగస్టు 15న కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. కొత్త బొలెరోలో అనేక కాస్మెటిక్ అప్‌డేట్‌లు (Cosmetic Updates) చూడవచ్చు. ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు (Round Headlamps), వెనుక భాగంలో వర్టికల్ టెయిల్ ల్యాంప్‌లు (Vertical Tail Lamps) ఉండవచ్చు. అయితే, ఇవి తుది ప్రొడక్షన్ మోడల్‌లో మారే అవకాశం ఉంది. లీకైన చిత్రాలను బట్టి, వెనుక డోర్‌పై పూర్తి సైజులో స్పేర్ టైర్ (Spare Tyre) అమర్చబడి ఉంటుంది. ఇంకా, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పోలిక

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో వర్టికల్ లైన్స్ తో కూడిన గ్రిల్, మధ్యలో మహీంద్రా లోగో ఉన్నాయి. కొత్త ఎస్‌యూవీ సైడ్ ప్రొఫైల్, దాని ఫ్లాట్ సైడ్స్, రెక్టాంగ్యులర్ వీల్ ఆర్చ్‌లతో ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) ను గుర్తుచేస్తుంది. సైడ్ లో అల్లాయ్ వీల్స్ కూడా ఇవ్వనుంది. ఫీచర్ల (Features) విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వంటివి కూడా ఉంటాయి.

మెరుగైన సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ కోసం కొత్త బొలెరోలో క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), స్టెబిలిటీ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు లభించవచ్చు. మహీంద్రా కొత్త న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ అనేది కొత్త మోనోకాక్ ఛాసిస్. ఇది వాహనం బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిని హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్‌లతో కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌తో 1.2 లక్షల మోడళ్లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మోడల్‌లను మహీంద్రా చాకన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తారు. ఈ మార్పులన్నీ బొలెరోను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story