మహీంద్రా కార్లపై బంపర్ డిస్కౌంట్లు

Mahindra : మహీంద్రా కార్లను కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఇదో మంచి ఛాన్స్. కంపెనీ తమ పాపులర్ మోడల్స్ అయిన బొలెరో, XUV 3XO, స్కార్పియో క్లాసిక్, XUV400 ఈవీ, XUV700పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఏ మోడల్‌పై ఎంత లాభం పొందవచ్చో, ఎంత డబ్బు ఆదా చేయవచ్చో ఈ వార్తలో తెలుసుకుందాం.

మహీంద్రా XUV 3XOపై తగ్గింపు

ఈ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. AX5 (పెట్రోల్, మాన్యువల్), AX5 L వేరియంట్లపై రూ.25,000 వరకు తగ్గింపు ఉంది. అయితే, MX1, MX2 Pro, MX3, MX3 Pro వేరియంట్లపై మాత్రం ప్రస్తుతం ఎలాంటి తగ్గింపు లేదు.

మహీంద్రా బొలెరోపై తగ్గింపు

బొలెరో ఎస్‌యూవీలో B6 (O) టాప్ వేరియంట్‌పై రూ.92,700 వరకు, అలాగే B6, B4 వేరియంట్లపై రూ.40,000 వరకు తగ్గింపు లభిస్తుంది. బొలెరో నియోలో, N10(O), N10 వేరియంట్లపై రూ. లక్ష వరకు, N8 వేరియంట్‌పై రూ.65,000 వరకు, N4 వేరియంట్‌పై రూ.40,000 వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

మహీంద్రా స్కార్పియో పై ఆఫర్లు

స్కార్పియో ఎన్, స్కార్పియో క్లాసిక్ మోడల్స్‌పై జూలై నెలలో డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్‌పై రూ.75,000 వరకు, క్లాసిక్ ఎస్11 వేరియంట్‌పై రూ.50,000 వరకు లాభం పొందవచ్చు. ఇక స్కార్పియో ఎన్ విషయానికి వస్తే, Z8, Z8 L బ్లాక్ ఎడిషన్‌లపై రూ.40,000 వరకు, Z4, Z6 వేరియంట్లపై రూ.30,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే, Z2 బేస్ వేరియంట్‌పై ప్రస్తుతం ఎలాంటి తగ్గింపు లేదు.

మహీంద్రా XUV700, XUV400 ఈవీపై ఎంత డిస్కౌంట్?

ఈ ఎస్‌యూవీలను ఇష్టపడితే, XUV700లోని AX5 S, AX5 వేరియంట్లపై రూ.30,000 వరకు, అలాగే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XUV400 ఈవీ EL Pro వేరియంట్‌పై రూ.2.5 లక్షల వరకు ఆదా చేసుకునే మంచి అవకాశం ఉంది. ఈ తగ్గింపు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story