మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల పై రూ.4లక్షల తగ్గింపు

Mahindra : మహీంద్రా తన ఎలక్ట్రిక్ కార్లైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ మోడళ్ల ధరలను తగ్గించింది. ఇప్పుడు రూ.4 లక్షల వరకు తగ్గింపుతో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ప్యాక్ 2 వేరియంట్లలో కూడా పెద్ద 79kWh బ్యాటరీ ప్యాక్‌ను మహీంద్రా అందిస్తోంది. ఇదివరకు ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ టాప్ ప్యాక్ 3 వేరియంట్‌లకే ఉండేది.

కొత్త ధరలు, ఎక్కువ రేంజ్!

మహీంద్రా బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ మోడళ్ల ప్యాక్ 2 వేరియంట్‌లు ఇప్పుడు 59kWh, 79kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తున్నాయి.

బీఈ 6: 79kWh వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.23.5 లక్షలు, 59kWh వేరియంట్ ధర రూ.21.9 లక్షలు. రెండింటి మధ్య రూ.1.6 లక్షల వ్యత్యాసం ఉంది.

ఎక్స్‌ఈవీ 9ఈ: 79kWh వేరియంట్ ధర రూ.26.5 లక్షలు, 59kWh వేరియంట్ ధర రూ.24.9 లక్షలు. ఈ మోడళ్ల మధ్య కూడా రూ.1.6 లక్షల వ్యత్యాసం ఉంది.

కస్టమర్‌లకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే బీఈ 6 ప్యాక్ 2 లాంగ్ రేంజ్ వేరియంట్ ఇప్పుడు టాప్ ప్యాక్ 3 కంటే రూ.3.4 లక్షలు తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే, ఎక్స్‌ఈవీ 9ఈ ప్యాక్ 2 లాంగ్ రేంజ్ వేరియంట్ టాప్ ప్యాక్ 3 కంటే రూ.4 లక్షలు తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

రేంజ్ విషయానికి వస్తే బీఈ 6 లాంగ్ రేంజ్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 683 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఎక్స్‌ఈవీ 9ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 656 కి.మీ. రేంజ్ ఇస్తుంది. మహీంద్రా బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ మోడళ్ల ప్యాక్ 2 వేరియంట్‌ల డెలివరీలు జులై 2025 చివరి నుండి ప్రారంభమవుతాయి. ఇదివరకు కేవలం ప్యాక్ 3 వేరియంట్‌ల డెలివరీలే జరుగుతున్నాయి. బుకింగ్ చేసుకున్న కస్టమర్‌లు తమ ఆర్డర్‌లను కొత్త ప్యాక్ 2 79kWh వేరియంట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story