ఫీచర్లు, రేంజ్ వివరాలివే

Mahindra : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కారు స్పెషాలిటీ ఏంటంటే కేవలం 300 యూనిట్లను మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. దీని బుకింగ్‌లు ఆగస్టు 23, 2025 నుంచి మొదలవుతాయి. సెప్టెంబర్ 20, 2025న అంతర్జాతీయ బ్యాట్‌మ్యాన్ డే సందర్భంగా డెలివరీలను ప్రారంభిస్తారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.27.79 లక్షలుగా ఉంది.

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కారు మొత్తం బాడీకి కస్టమ్ సాటిన్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. దీనికి తోడు అల్కెమి గోల్డ్ రంగులో ఉన్న సస్పెన్షన్, బ్రేక్ కాలిపర్స్ ఈ కారుకు మరింత అద్భుతమైన లుక్‌ని ఇస్తున్నాయి. 20-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్, ముందు డోర్‌పై కస్టమ్ బ్యాట్‌మ్యాన్ డెకాల్స్, వెనుక భాగంలో ఉన్న BE 6 × The Dark Knight బ్యాడ్జింగ్ దీన్ని స్పెషల్ గా నిలబెడతాయి.

ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ కూడా లగ్జరీ, సినిమాటిక్ ఫీలింగ్‌ను ఇస్తుంది. డాష్‌బోర్డ్‌పై బ్రష్డ్ గోల్డ్ ప్లేక్ మీద యూనిక్ నంబర్, చార్‌కోల్ లెదర్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌పై గోల్డ్ హైలైట్స్ కనిపిస్తాయి. సీట్లు సూడ్, లెదర్‌తో కలిపి తయారు చేశారు. వాటిపై గోల్డ్ కుట్లు, బ్యాట్ చిహ్నం డిటైలింగ్ కూడా ఉంది. స్టీరింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కంట్రోల్ కనెక్టర్, బూస్ట్ బటన్‌పై కూడా బ్యాట్ లోగో ఉంటుంది. కారు స్టార్ట్ చేయగానే ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై బ్యాట్‌మ్యాన్ థీమ్‌తో కూడిన వెల్‌కమ్ యానిమేషన్ మొదలవుతుంది.

ఈ ఈవీలో 79 kWh పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 683 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నిజ జీవితంలో ఏసీ ఆన్‌లో ఉన్నా కూడా ఇది సులభంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని అంచనా. లిమిటెడ్ ఎడిషన్ కావడంతో దీని ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లు దీన్ని మరింత స్పెషల్ కారుగా మారుస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story