షాకింగ్ సేల్స్ రిపోర్ట్

Mahindra Scorpio : భారతీయ మార్కెట్‌లో మహీంద్రా కార్ల అమ్మకాల ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్లో సంస్థ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ మహీంద్రా స్కార్పియో గత నెల (సెప్టెంబర్ 2025) లో కంపెనీ మోడల్ వారీ అమ్మకాలలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్కార్పియో ఏకంగా 27 శాతం వార్షిక వృద్ధిని సాధించి, అమ్మకాలలో నంబర్-1 గా నిలిచింది. సెప్టెంబర్ 2025 నెలలో మహీంద్రా స్కార్పియో అద్భుతమైన అమ్మకాలతో కంపెనీ మోడల్స్ అన్నింటిలోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. స్కార్పియోకు గత నెలలో మొత్తం 18,372 మంది దీనిని కొనుగోలు చేశారు. ఇది వార్షిక అమ్మకాల వృద్ధిలో 27 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

రెండో స్థానంలో మహీంద్రా థార్ నిలిచింది, దీని మొత్తం 11,846 యూనిట్లు అమ్ముడయ్యాయి. మూడో స్థానంలో మహీంద్రా XUV 700 9,764 యూనిట్లతో (1 శాతం వృద్ధి) నిలవగా, నాలుగో స్థానంలో మహీంద్రా XUV 3XO 9,032 యూనిట్లతో ఉంది. మహీంద్రా స్కార్పియో-N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ఎస్‌యూవీకి ప్రస్తుతం కంపెనీ భారీ ఆఫర్లను అందిస్తోంది. కొత్త జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత స్కార్పియో-N అన్ని వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ. 1.45 లక్షల వరకు తగ్గాయి.

దీనికి అదనంగా కారుపై రూ.71 వేల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా కస్టమర్‌లు మొత్తం రూ. 2.15 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. స్కార్పియో-N మార్కెట్‌లో ముఖ్యంగా టాటా సఫారీ, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజీ హెక్టర్, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా XUV 700 వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

మహీంద్రా స్కార్పియో-N తన స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), రేర్ కెమెరా, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ సీట్లు వంటి లేటెస్ట్ ఫీచర్లను జోడించారు. సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

స్కార్పియో-N లో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో-N Z4 వేరియంట్ ఇంజన్, పనితీరు విషయానికి వస్తే, ఇందులో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజన్, ఆటోమేటిక్ వెర్షన్‌లో 203 PS పవర్, 380 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story