Mahindra Scorpio N : ఊరైనా, సిటీ అయినా స్కార్పియో ఎన్ తర్వాతే ఏదైనా..అదిరిపోయే ఫీచర్లు, అదిరే మైలేజ్
అదిరిపోయే ఫీచర్లు, అదిరే మైలేజ్

Mahindra Scorpio N : భారతదేశ రహదారుల మీద గంభీరంగా దూసుకుపోయే ఎస్‌యూవీ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా మహీంద్రా స్కార్పియో ఎన్ అని చెప్పవచ్చు. నగరాల్లోని సాఫ్ట్ రోడ్ల నుంచి గ్రామాల్లోని కఠినమైన మట్టి రోడ్ల వరకు దేనినైనా ఎదుర్కోగల సత్తా దీని సొంతం. కేవలం స్టైల్ మాత్రమే కాదు, పవర్, కంఫర్ట్ కలగలిసిన ప్యాకేజీగా ఈ కారు గుర్తింపు పొందింది. రోజువారీ ప్రయాణాలకు, వీకెండ్ ట్రిప్పులకు ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వెహికల్. మరీ ముఖ్యంగా ఎత్తుగా ఉండే సీటింగ్ పొజిషన్ వల్ల డ్రైవర్ కు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది, దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు కొండంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
ధర విషయానికి వస్తే.. స్కార్పియో ఎన్ రూ.13.85 లక్షల నుంచి రూ.24.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. తన సెగ్మెంట్‌లోని ఇతర కార్లతో పోలిస్తే ఇది చాలా రీజనబుల్ అని చెప్పాలి. ఇందులో పెట్రోల్, డీజిల్.. రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేగాన్ని కోరుకునే వారికి నచ్చితే, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ లాంగ్ డ్రైవ్స్, ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్. పెట్రోల్ మోడల్ లీటరుకు 12-13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, డీజిల్ వెర్షన్ ఏకంగా 15-17 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తూ వాహనదారుల జేబుకు భారం తగ్గించుతోంది.
కారు లోపలి ఫీచర్లు చూస్తే ఏదో లగ్జరీ హోటల్ లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సోనీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హంగులు ఇందులో ఉన్నాయి. పెద్ద కుటుంబం కోసం 6, 7 సీటర్ ఆప్షన్లు ఉండటం మరో విశేషం. సేఫ్టీ విషయంలో మహీంద్రా రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీతో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు ప్రయాణికులకు రక్షణ కవచంలా నిలుస్తాయి. స్టైల్, పవర్, సేఫ్టీ.. ఈ మూడూ కలగలిసిన స్కార్పియో ఎన్ ఇప్పుడు ఇండియన్ రోడ్లపై నిజమైన బిగ్ డాడీగా వెలుగొందుతోంది.

