UpComing Cars : మనీ రెడీ చేస్కోండి.. రాబోయే ఆర్నెళ్లలో మార్కెట్లోకి 3కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలు
రాబోయే ఆర్నెళ్లలో మార్కెట్లోకి 3కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీలు

UpComing Cars : మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త కొత్త మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్, మహీంద్రా, రెనాల్ట్ వంటి సంస్థల కొత్త కార్లు త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఈ మూడు ఆటో కంపెనీల కొత్త మోడళ్ల లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ అవి రాబోయే 6 నుండి 9 నెలల్లో విడుదల కావచ్చని అంచనా. ఈ మూడు కార్లు పవర్ఫుల్ ఇంజిన్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో రానున్నాయి.
1. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా ఇప్పుడు తమ ప్రముఖ ఎస్‌యూవీ XUV700 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై పనిచేస్తోంది. ఈ కారు 2026 ప్రారంభంలో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్ లుక్, గతంలో కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుంది. అయితే, ఈ కారు ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుత మోడల్ లాగే, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో విడుదల కావచ్చు.
2. కొత్త టాటా సియెరా
టాటా మోటార్స్ ఈ కొత్త ఎస్‌యూవీ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఈ కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ మొదట ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు కూడా విడుదల కావచ్చు.
3. కొత్త తరం రెనాల్ట్ డస్టర్
రెనాల్ట్ త్వరలో కొత్త తరం డస్టర్ తో భారత మార్కెట్లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చు.ఈ కొత్త రెనాల్ట్ ఎస్‌యూవీ 2026 ప్రారంభంలో లాంచ్ కావచ్చు. ఈ కారును సీఎమ్‌ఎఫ్-బి+ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తారు. మొదట ఈ ఎస్‌యూవీని పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకొస్తారు. ఆ తర్వాత కంపెనీ ఈ ఎస్‌యూవీ,హైబ్రిడ్ మోడల్‌ను కూడా వినియోగదారుల కోసం లాంచ్ చేయవచ్చు.
