బిజినెస్‌లో లాభాల పంట పండించే ఎలక్ట్రిక్ ఆటో

Mahindra UDO : భారతదేశ త్రీ-వీలర్ మార్కెట్‌లో విప్లవం సృష్టించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా మరో అడుగు ముందుకు వేసింది. మహీంద్రా లాస్ట్ మైల్ మోబిలిటీ విభాగం నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మహీంద్రా యుడో మార్కెట్లోకి విడుదలయ్యింది. సాధారణ ఆటోల కంటే భిన్నంగా అత్యాధునిక డిజైన్, అదిరిపోయే రేంజ్‌తో వచ్చిన ఈ వాహనం.. డ్రైవర్ల ఆదాయాన్ని పెంచడమే కాకుండా ప్రయాణికులకు విమానం లాంటి అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మహీంద్రా యుడో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పబోతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.3,84,299గా నిర్ణయించింది. అయితే లిమిటెడ్ టైం ఆఫర్ కింద దీనిని రూ.3,58,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్‌లో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో దీనిని తయారు చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం.

పర్ఫార్మెన్స్ విషయంలో మహీంద్రా యుడో రాజీ పడలేదు. ఇందులో 11.7 kWh సామర్థ్యం కలిగిన శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుంది. సాధారణ రోడ్లపై సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్ల సౌకర్యం కోసం ఇందులో రేంజ్, రైడ్, రేస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు.

ఈ ఆటో డిజైన్ చూడగానే ఆకట్టుకుంటుంది. విమానాల నుంచి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించారు. సెగ్మెంట్లోనే మొదటిసారిగా మోనోకాక్ బాడీ స్ట్రక్చర్‌తో రావడం వల్ల ఇది చాలా దృఢంగా ఉంటుంది. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా పైలట్ సీట్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకు కాలు పెట్టుకోవడానికి , తల తగలకుండా విశాలమైన స్థలాన్ని కల్పించారు. డ్యూయల్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ వల్ల గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో స్మూత్ గా సాగుతుంది.

కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు మహీంద్రా ఈ వాహనంపై 6 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు భారీ వారంటీని అందిస్తోంది. భద్రత కోసం హిల్ హోల్డ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ థ్రాటిల్, ట్యూబ్‌లెస్ టైర్ల వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాఫిక్‌లో ఆటోను ఈజీగా నడిపేందుకు క్రీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్లన్నీ కలిసి డ్రైవర్ల పనిని సులభతరం చేయడమే కాకుండా గౌరవప్రదమైన ప్రయాణాన్ని అందిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story