మహీంద్రా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Mahindra XEV 7e : XEV 9e, BE 6 వంటి మోడళ్లను విడుదల చేసిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరించడానికి రెడీ అవుతుంది. ఇందులో భాగంగా నవంబర్ 2025లో మహీంద్రా XEV 7e ని విడుదల చేయనుంది. ఇది వాస్తవానికి XEV 9e కూపే ఎస్‌యూవీకి చెందిన 7-సీటర్ వేరియంట్. ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రెయిన్, డిజైన్, అనేక ఫీచర్లను పంచుకోనున్నాయి. అయితే, XEV 7e మోడల్ ICE-ఆధారిత XUV700 మాదిరిగా బాక్సీ షేప్ కలిగి ఉంటుంది.

లీకైన ఫోటోల ఆధారంగా చూస్తే, రాబోయే మహీంద్రా XEV 7eలో బ్లాకవుట్ గ్రిల్, బాడీ అంతటా ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎయిరో-ఆప్టిమైజ్డ్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు వంటి అడ్వాన్సుడ్ డిజైన్ అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ కారు XEV 9e మోడల్‌తో చాలా భాగాలను పంచుకున్నప్పటికీ, వెనుకవైపు ఉండే మూడవ వరుస సీట్ల కారణంగా దీని ఆకృతి XUV700 మాదిరిగా ఉంటుంది.

మహీంద్రా 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, దీని కేబిన్ లేఅవుట్, ఫీచర్లు కూడా XEV 9e లో ఉన్నట్టే ఉండే అవకాశం ఉంది. ఈ వాహనంలో మూడు స్క్రీన్ల సెటప్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఎయిర్‌బ్యాగ్‌లు వంటి కీలక ఫీచర్లు ఉంటాయని అంచనా.

మహీంద్రా XEV 7e ఎస్‌యూవీకి XEV 9e నుంచి తీసుకున్న 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. ఈ 7-సీటర్ మోడల్‌లో 286bhp మోటార్ ఉంటుంది. ఇది వెనుక చక్రాలకు ఎనర్జీని అందిస్తుంది. ఇది 5-సీటర్ XEV 9e కంటే శక్తివంతమైనది. XEV 9e (5-సీటర్) మోడల్‌లో 79kWh బ్యాటరీ ఒకే ఛార్జింగ్‌పై 656 కి.మీ MIDC రేంజ్‌ను ఇస్తుంది. XEV 7e డ్రైవింగ్ రేంజ్ కూడా దాదాపుగా 5-సీటర్ మోడల్‌కు సమానంగా ఉండే అవకాశం ఉంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story