ఇంకా ఏమున్నాయంటే ?

Mahindra XEV 9S : మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ భారతీయ మార్కెట్‌లో కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. అదే మహీంద్రా XEV 9S. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు గత నెల నవంబర్ 27, 2025న అధికారికంగా లాంచ్ అయింది. INGLO ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.95 లక్షలు. ముఖ్యంగా, ఈ కారులో వీడియో కాలింగ్ , డ్రైవ్ వీడియో రికార్డింగ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. XEV 9S వివిధ వేరియంట్‌ల ధరలు, బ్యాటరీ ప్యాక్‌ల వివరాలు, బుకింగ్ తేదీలను తెలుసుకుందాం.

భారతీయ వినియోగదారుల కోసం మహీంద్రా కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కారు మహీంద్రా XEV 9S ను నవంబర్ 27, 2025న అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త ఈవీ INGLO ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి రూపొందించబడింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర (బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర) రూ. 19.95 లక్షలుగా నిర్ణయించబడింది. కారు బుకింగ్‌లు జనవరి 14, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. డెలివరీలను జనవరి 23, 2026 నుంచి కస్టమర్లకు అందించడం మొదలవుతుంది.

XEV 9S కారు వివిధ బ్యాటరీ ప్యాక్ సైజులు మరియు ఫీచర్ సెట్‌ల ఆధారంగా పలు వేరియంట్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ అయిన Pack One Above (రూ. 19.95 లక్షలు) 59 kWh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. అదే 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న Pack One Above ధర రూ. 21.95 లక్షలుగా ఉంది. మధ్య శ్రేణి వేరియంట్లు అయిన Pack Two Above, 70 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లలో రూ.24.45 లక్షల ధరతో లభిస్తాయి. ఇక టాప్ మోడల్ అయిన Pack Three Above (రూ. 29.45 లక్షలు) 79 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

XEV 9S లోని టాప్ వేరియంట్ అయిన Pack Three Above లో అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ఈ ఈవీలో వీడియో కాలింగ్ చేసుకునే ఫీచర్, కారును ఆటోమేటిక్‌గా పార్క్ చేయడానికి సహాయపడే ఆటోపార్క్ అసిస్ట్, ప్రయాణంలో వీడియోను రికార్డ్ చేసే డ్రైవ్ వీడియో రికార్డింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇది 7 ఎయిర్‌బ్యాగులతో పాటు, లైవ్ వ్యూ, రికార్డింగ్‌తో కూడిన సెక్యూర్ 360-డిగ్రీ వ్యూ కెమెరాను కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో ఎమర్జెన్సీ స్టీరింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఫ్రంట్ అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అడ్వాన్సుడ్ ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్లు కూడా అందించబడ్డాయి. టాప్ మోడల్‌లో ప్రత్యేకంగా నైట్ టెయిల్ కార్పెట్ ల్యాంప్స్ కూడా అమర్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story