XUV 7XOలో రాబోతున్న టాప్ 5 ఫీచర్లు ఇవే

Mahindra XUV 7XO : మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ XUV700ని సరికొత్త హంగులతో, సరికొత్త పేరుతో మార్కెట్లోకి తెస్తోంది. XUV 7XO పేరుతో రాబోతున్న ఈ కారు, పాత మోడల్ కంటే ఎంతో అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో నిండి ఉంది. జనవరి 5, 2026న గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ, తన ప్రధాన ప్రత్యర్థులైన టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.

ట్రిపుల్ స్క్రీన్ మ్యాజిక్

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లలో (XEV 9e) చూసినట్లుగానే.. XUV 7XOలో కూడా ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉండబోతోంది. ఇందులో మూడు 12.3 అంగుళాల స్క్రీన్లు పక్కపక్కనే అమర్చబడి ఉంటాయి. డ్రైవర్ కోసం ఒకటి, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి, మునుపెన్నడూ లేని విధంగా ముందు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. దీనివల్ల పక్కన కూర్చున్న వారు డ్రైవర్‌ను ఇబ్బంది పెట్టకుండా తమకు నచ్చిన వీడియోలు లేదా నావిగేషన్‌ను చూసుకోవచ్చు.

సినిమా హాల్ లాంటి సౌండ్ సిస్టమ్

మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 16 స్పీకర్ల హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. పాత XUV700లో ఉన్న 12 స్పీకర్ల సోనీ సిస్టమ్ కంటే ఇది ఎంతో మెరుగైన ఆడియో అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు ఇన్-కార్ థియేటర్ మోడ్ కూడా ఉండటం విశేషం. దీనివల్ల లాంగ్ జర్నీలలో ప్రయాణికులు బోర్ ఫీల్ అవ్వకుండా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

ప్రీమియం అప్‌డేట్స్ - పావర్డ్ టెయిల్‌గేట్

మహీంద్రా తన కస్టమర్ల సౌకర్యం కోసం ఈసారి ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఫీచర్‌ను జోడిస్తోంది. చేతిలో లగేజీ ఉన్నప్పుడు బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా డిక్కీ డోర్ తెరుచుకుంటుంది. టాటా సఫారీ వంటి కార్లలో ఇప్పటికే ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు మహీంద్రా కూడా ప్రవేశపెడుతోంది. అంతేకాకుండా రెండో వరుస సీట్లను అడ్జస్ట్ చేసుకునేలా స్లైడింగ్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వెనుక కూర్చునే వారికి లెగ్‌రూమ్ సమస్య ఉండదు.

అడ్వాన్స్‌డ్ వ్యూ - 540 డిగ్రీ కెమెరా

సాధారణంగా కార్లలో 360 డిగ్రీ కెమెరా ఉంటుంది, కానీ XUV 7XOలో 540 డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉండబోతోంది. ఇది కారు చుట్టూ ఉన్న పరిసరాలనే కాకుండా, కారు కింద ఉన్న రోడ్డు పరిస్థితులను కూడా స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు లేదా ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేసేటప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఏఆర్ హెడ్-అప్ డిస్‌ప్లే కూడా నావిగేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది.

ధర, పోటీ

మహీంద్రా XUV 7XO ప్రారంభ ధర దాదాపు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. జనవరి 5న దీని అధికారిక లాంచ్ జరగనుంది. ఇప్పటికే రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సరికొత్త డిజైన్, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో రాబోతున్న ఈ ఎస్‌యూవీ, మార్కెట్లో ఉన్న ఇతర కార్లకు ముచ్చెమటలు పట్టించడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story