త్వరలోనే మహీంద్రా 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7e

Mahindra : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా టాటా మోటార్స్ హారియర్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో మహీంద్రా తన కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XEV 7e ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు 2026 ప్రారంభంలో మార్కెట్లో విడుదల కానుంది. XEV 9e కూపే ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించబడిన ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఈ వార్తలో చూద్దాం.

మహీంద్రా సంస్థ నుంచి రాబోతున్న XEV 7e ఎస్‌యూవీని ఇటీవల ఛార్జింగ్ స్టేషన్ వద్ద టెస్టింగ్ చేస్తున్నప్పుడు కెమెరాల్లో బంధించారు. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ XEV 9e కూపే ఎస్‌యూవీ పెద్ద వెర్షన్. స్పై షాట్స్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త మోడల్‌లో మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డోర్‌తో సమానంగా ఉండే ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ORVMs, కొద్దిగా ఉబ్బెత్తుగా ఉన్న వీల్ ఆర్చ్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, చిన్న రేర్ స్పాయిలర్ వంటి అంశాలు కనిపిస్తున్నాయి.

XEV 7e ఎస్‌యూవీ, XEV 9e కంటే పొడవుగా, మరింత విశాలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిజైన్ పరంగా XEV 9e డిజైన్ పోలి ఉండే అవకాశం ఉంది. రాబోయే మహీంద్రా XEV 7e ఎస్‌యూవీలో కూడా XEV 9e లో ఉపయోగించిన అదే బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. ఇందులో 59 kWh, 79 kWh LFP బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది.

చిన్న 59 kWh బ్యాటరీ ప్యాక్ 286 bhp మోటారుతో వచ్చి, దాదాపు 542 కి.మీ డ్రైవింగ్ రేంజ్ ఇవ్వవచ్చు. పెద్ద 79 kWh బ్యాటరీ ప్యాక్ 231 bhp మోటారుతో వచ్చి, దాదాపు 656 కి.మీ రేంజ్ ఇవ్వవచ్చని అంచనా. XEV 7e రేంజ్ దాదాపు XEV 9e మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. XEV 7e ఎస్‌యూవీ ఇంటీరియర్ లేఅవుట్ కూడా XEV 9e ను పోలి ఉంటుందని, అయితే అదనంగా మూడవ వరుస సీట్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆటో డిమ్మింగ్ IRVM, HUD (హెడ్స్-అప్ డిస్‌ప్లే), ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు లభించవచ్చు. ADAS లో ఆటో లేన్ ఛార్జ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీంతో పాటు, లైవ్ రికార్డింగ్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story