.Thar, Scorpio, XUV700.. అన్నీ కరెంట్ కార్లే

Mahindra : మహీంద్రా కంపెనీ రాబోయే సంవత్సరాల్లో తమ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్ అయిన థార్, స్కార్పియో, XUV700లను పూర్తిగా కొత్త రూపంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. తమ బ్రాండ్‌కు ఉన్న అతిపెద్ద బలం ఈ పాత మోడల్సే అని కంపెనీ అర్థం చేసుకుంది. అందుకే వీటిని కొత్త టెక్నాలజీ, ఎలక్ట్రిక్ పవర్, మోడర్న్ ఫీచర్స్‌తో మరో స్థాయికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసింది. ఈ మొత్తం వ్యూహానికి ఎలక్ట్రిక్ మార్పు ప్రధాన కేంద్రంగా ఉంది.

1. కొత్త మహీంద్రా XUV700

మహీంద్రా అతిపెద్ద అప్‌గ్రేడ్ రాబోయే XUV700లో ఉండనుంది. ఇప్పటికే కంపెనీ XEV 9S అనే 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. దానికి కొనసాగింపుగా, తమ అత్యంత పాపులర్ అయిన XUV700కు కూడా భారీ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. జనవరి 2026లో ఈ కొత్త XUV700 వచ్చే అవకాశం ఉంది. ఇందులో కంపెనీ సరికొత్త ట్రిపుల్-స్క్రీన్ సెటప్‌ను తీసుకురాబోతోంది. అంటే డాష్‌బోర్డ్‌లో ఏకంగా మూడు పెద్ద డిస్‌ప్లేలు ఉండే అవకాశం ఉంది. ఇది కారు లోపల లగ్జరీ అనుభూతిని మరింత పెంచుతుంది.

2. స్కార్పియో కొత్త అవతారం

మరోవైపు, పవర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న స్కార్పియోను కూడా మహీంద్రా పూర్తిగా కొత్త రూపంలో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఇటీవల Vision S కాన్సెప్ట్ ద్వారా దీని రూపం ఎలా ఉంటుందో సూచన ఇచ్చింది. అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పాత స్కార్పియో మాదిరిగా ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ స్ట్రక్చర్‌పై కాకుండా, కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై మోనోకోక్ ఛాసిస్‌తో తయారు కానుంది. దీనివల్ల స్కార్పియో రోడ్-ఫోకస్డ్‌గా, మరింత ప్రీమియంగా, మోడర్న్‌గా మారుతుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

3. థార్ ఎలక్ట్రిక్ వెర్షన్‌

మహీంద్రా లైఫ్‌స్టైల్ ఐకాన్ అయిన థార్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో రాబోతోంది. ఇటీవల చూపించిన Vision T కాన్సెప్ట్ అనేది, నిజానికి 5-డోర్ల థార్ రాక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్. దీనిలో పాత థార్‌లాగే బలంగా, మస్కులర్ లుక్ కొనసాగుతుంది. అయితే కొన్ని EV-కి ప్రత్యేకమైన డిజైన్ అంశాలు యాడ్ చేశారు. థార్ EVను కూడా NU_IQ ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేయనున్నారు. ఇందులో మల్టిపుల్ బ్యాటరీ ఆప్షన్లు, డ్యూయల్-మోటార్ 4X4 సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇది ఆఫ్-రోడింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story