సెల్టోస్, డస్టర్ సహా బడా మోడల్స్ లిస్ట్ ఇదే

SUV Launches : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రాబోయే 60 రోజులు SUV లవర్స్‌కు నిజంగా పండుగే. ఈ కాలంలో కనీసం నాలుగు కొత్త SUV మోడల్స్, పవర్‌ట్రైన్ అప్‌డేట్‌లు లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కొత్త తరం కియా సెల్టోస్ డిసెంబర్ 10న లాంచ్ అవుతుండగా టాటా సఫారీ, హారియర్‌లకు డిసెంబర్ 9న కొత్త పెట్రోల్ ఇంజిన్ లభించనుంది. అంతేకాకుండా వచ్చే నెల జనవరి 26న అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటైన రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్‌లో తిరిగి రాబోతోంది. ఈ ముఖ్యమైన లాంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

టాటా సఫారీ, హారియర్ పెట్రోల్

టాటా మోటార్స్ తమ ప్రముఖ SUVలు అయిన సఫారీ, హారియర్లకు కొత్త ఇంజిన్ ఆప్షన్‌ను అందించనుంది. ఈ రెండు SUVలలో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ రానుంది. ఇది టాటా సొంతంగా అభివృద్ధి చేసిన హైపీరియన్ సిరీస్‌కు చెందిన ఫోర్-సిలిండర్ ఇంజిన్. ఈ ఇంజిన్‌ను టాటా ఇప్పటికే కొత్త సియెర్రా మోడల్‌లో పరిచయం చేసింది. ఈ పెట్రోల్ ఇంజిన్ అద్భుతమైన పర్ఫామెన్స్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో డ్యుయల్-క్లచ్ ఆటోమేటిక్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండవచ్చు. పెట్రోల్ వేరియంట్ రాకతో ఈ మోడల్స్ ధరలు డీజిల్ వెర్షన్‌ల కంటే తగ్గి, కస్టమర్లకు మరింత అందుబాటులోకి వస్తాయి.

కొత్త తరం కియా సెల్టోస్

కియా సెల్టోస్ తన నెక్స్ట్-జనరేషన్ లుక్‌లో డిసెంబర్ 10న లాంచ్ కావడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. వాహన తయారీ సంస్థ ఇప్పటికే ఈ SUV టీజర్‌ను విడుదల చేసింది, ఇందులో కొత్తగా డిజైన్ చేయబడిన గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్లు) కనిపిస్తున్నాయి. కొత్త LED టైల్‌లైట్స్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. కొత్త తరం కియా సెల్టోస్, ప్రస్తుత మోడల్ కంటే మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అనేక అప్‌డేట్‌లతో రానుంది. ఇంటీరియర్, పవర్‌ట్రైన్ మార్పుల గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, పనరోమిక్ సన్‌రూఫ్ ఉండే అవకాశం స్పష్టంగా కనిపించింది.

రెనాల్ట్ డస్టర్ రీ ఎంట్రీ

కొన్ని సంవత్సరాల క్రితం నిలిపివేయబడినప్పటికీ, రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు రెనాల్ట్ సంస్థ ఈ పాపులర్ SUVని కొత్త జనరేషన్‌లో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న కొత్త తరం డస్టర్, వచ్చే ఏడాది జనవరి 26న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది CMF-B ఆర్కిటెక్చర్ పై నిర్మించారు. పాత మోడల్ కంటే పూర్తిగా కొత్త లుక్‌తో రానుంది. ఈ కొత్త SUV మరింత పవర్ఫుల్ గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో ఉంటుందని భావిస్తున్నారు. ఈ డస్టర్ రాకతో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత పెరుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story