Maruti : రూ.4.23 లక్షలకే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 33 కి.మీ మైలేజ్.. దేశంలోనే అత్యంత చౌకైన కారుపై భారీ డిస్కౌంట్
దేశంలోనే అత్యంత చౌకైన కారుపై భారీ డిస్కౌంట్

Maruti : కొత్తగా కారు కొనాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా బడ్జెట్ తక్కువగా ఉన్నా, మంచి మైలేజ్, సేఫ్టీ ఉన్న కారు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. భారతదేశంలోనే అత్యంత చౌకైన కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఆల్టో K10 పై కంపెనీ ఈ ఆగస్టు నెలలో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ.71,960 వరకు తగ్గింపు లభిస్తోంది. రాఖీ పండుగ, ఇతర పండుగల సీజన్ కావడంతో మారుతి సుజుకి తమ కార్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా ఎంట్రీ లెవెల్ కారు అయిన ఆల్టో K10 పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. జూలై నెలలో రూ.67,100 వరకు డిస్కౌంట్ ఉండగా, ఈ నెలలో అది మరింత పెరిగి రూ.71,960కి చేరింది.
ఈ ఆఫర్లు ప్రత్యేకంగా ఆటోమేటిక్ వేరియంట్‌పై ఎక్కువ ఉన్నాయి. ఈ డిస్కౌంట్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లలో రూ.31,500 క్యాష్ డిస్కౌంట్తో పాటు, అదనంగా రూ.10,460 విలువైన కిట్ను కూడా ఉచితంగా ఇస్తున్నారు. పాత కారును ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.15,000 వరకు బోనస్, లేదా స్క్రాపేజ్ పాలసీ కింద రూ.25,000 వరకు బోనస్ లభిస్తుంది. ప్రభుత్వ లేదా కార్పొరేట్ ఉద్యోగులు అదనంగా రూ.5,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ.4.23 లక్షల నుంచి రూ.6.21 లక్షల వరకు ఉంటుంది. కొత్త ఆల్టో K10లో చాలా అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో K-సిరీస్ 1.0-లీటర్ డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ఉంది. ఇది 66.62 పీఎస్ పవర్, 89 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక లీటరుకు మంచి మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్ 24.90 km/l (ఆటోమేటిక్), 24.39 km/l (మాన్యువల్) మైలేజ్ ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ అయితే ఏకంగా 33.85 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ వీల్‌పై మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇప్పుడు ఆల్టో K10లో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. దీంతో పాటు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హై-స్పీడ్ అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
