Maruti Alto K10: కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. మారుతి ఆల్టో K10 పై బంపర్ ఆఫర్లు
మారుతి ఆల్టో K10 పై బంపర్ ఆఫర్లు

Maruti Alto K10: సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సెప్టెంబర్ నెలలో తన పాపులర్ కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆల్టో K10 పెట్రోల్ మోడల్‌కు చెందిన LXI వేరియంట్‌పై గరిష్టంగా రూ.62,500 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించింది. వినియోగదారులకు కంజ్యూమర్ ఆఫర్ కింద రూ.35,000 దక్కుతోంది. ఇందులో రూ.10,000 స్పాట్ బెనిఫిట్, రూ.25,000 ఆర్‌ఐపీఎస్ ఆఫర్ కలిసి ఉన్నాయి. ఇవే కాకుండా రూ.10,000 పిసిఎమ్ బోనస్, పాత బండిని ఇచ్చి కొత్తది తీసుకునే వారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఒకవేళ స్క్రాపేజ్ ఆప్షన్ ఎంచుకుంటే రూ.10,000 వరకు అదనపు లబ్ధి పొందే వీలుంది.
సీఎన్‌జీ వేరియంట్‌పై సైతం ఆకర్షణీయ ప్రయోజనాలు
కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే కాకుండా ఇతర మోడళ్లపైనా మారుతి భారీ తగ్గింపులను వర్తింపజేసింది. ఆల్టో K10 స్టాండర్డ్, సీఎన్‌జీ మోడళ్లను ఎంచుకునే కస్టమర్లు రూ.37,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇతర పెట్రోల్ వేరియంట్ల కొనుగోలుపై రూ.42,500 వరకు పొదుపు చేయవచ్చు. కార్పొరేట్ ఉద్యోగుల కోసం రూ.2,500 ఇన్స్టిట్యూషనల్ ఆఫర్, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు రూ.2,100 రూరల్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంచారు. తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.
అద్భుతమైన మైలేజ్.. నమ్మకమైన కే-సిరీస్ ఇంజిన్
ఈ బడ్జెట్ కారులో నెక్స్ట్-జెన్ కే-సిరీస్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. డ్రైవర్ల సౌకర్యార్థం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ఏజీఎస్ ఆప్షన్‌ను సైతం కంపెనీ అందిస్తోంది. పెట్రోల్ లీటరుకు సుమారు 24.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, సీఎన్‌జీ వెర్షన్ ఏకంగా కేజీకి 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
ఆధునిక ఫీచర్లు.. మెరుగైన భద్రతా ప్రమాణాలు
చిన్న కారే అయినప్పటికీ కస్టమర్ల దైనందిన అవసరాలకు తగ్గట్లుగా అద్భుతమైన ఫీచర్లను ఇందులో జోడించారు. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోలు, ఆకర్షణీయమైన డాష్‌బోర్డ్ లేఅవుట్ ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సేఫ్టీ లాక్‌ల వంటి కీలక భద్రతా ఫీచర్లు ఇచ్చారు. ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షల వరకు ఉంది. భారత్‌లో ఏకంగా 50 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటిన ఏకైక కారుగా ఆల్టో రికార్డు సృష్టించింది.

