ఆఫర్ డీటెయిల్స్ ఇవే

Brezza Discount Offer : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే, ఇదే మంచి సమయం. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, కియా సోనెట్‌లకు గట్టి పోటీనిచ్చే మారుతి సుజుకి బ్రెజా పై కంపెనీ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. నవంబర్ నెలలో ఈ పాపులర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.25,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి బ్రెజా ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లపై నవంబర్ నెలలో తగ్గింపు లభిస్తుంది. ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ రూ. 25,000 ప్రయోజనాన్ని వినియోగదారులు రెండు రకాలుగా పొందవచ్చు. పాత కారు ఎక్చేంజ్ చేస్తే రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పాత వాహనం స్క్రాప్ చేస్తే రూ. 25,000 స్క్రాప్ బోనస్ లభిస్తుంది. మారుతి బ్రెజా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8, 25, 900తో ప్రారంభమై, టాప్ వేరియంట్‌కు రూ. 13.01 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి బ్రెజాకు గట్టి పోటీ ఇచ్చే కార్లు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా టాటా నెక్సాన్ (ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు, ఎక్స్-షోరూమ్), కియా సోనెట్ (ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు, ఎక్స్-షోరూమ్), హ్యుందాయ్ వెన్యూ (ప్రారంభ ధర రూ. 7,89,900, ఎక్స్-షోరూమ్). బ్రెజాలో కొత్త తరం K సిరీస్ 1.5 లీటర్ డ్యూయల్ జెట్ వీవీటీ ఇంజన్ ను వాడారు. ఈ ఎస్‌యూవీ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజన్ 103 హెచ్‌పీ శక్తిని, 137 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సేఫ్టీ, టెక్నాలజీ విషయంలో బ్రెజా తన ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది. బ్రెజాలో మొత్తం 20 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా, స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి హై-టెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story