Maruti Brezza vs Tata Nexon : మారుతి బ్రెజా vs టాటా నెక్సాన్.. ఆఫీస్‌కు వెళ్లేవారికి ఏ ఎస్‌యూవీ బెస్ట్?
ఆఫీస్‌కు వెళ్లేవారికి ఏ ఎస్‌యూవీ బెస్ట్?

Maruti Brezza vs Tata Nexon : ప్రతిరోజూ ఆఫీస్‌కు రాకపోకలు సాగించే వారి కోసం ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి బ్రెజా, టాటా నెక్సాన్‌ల మధ్య ఏది సెలక్ట్ చేసుకోవాలో చాలా మందికి కష్టం. ఈ రెండు ఎస్‌యూవీలు మంచి పర్ఫార్మెన్స్, మైలేజీని అందిస్తాయి. మరి, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ధర, మైలేజ్, సేఫ్టీ, మెయింటెనెన్స్ ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది వివరంగా పోల్చి తెలుసుకుందాం.
కొనుగోలుదారులకు అత్యంత ముఖ్యమైన అంశం ధర, మెయింటెనెన్స్ ఖర్చు. ఈ విషయంలో రెండు కార్ల మధ్య స్వల్ప తేడా ఉంది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా కంటే కొంచెం తక్కువ ధరకు లభిస్తుంది. నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.32 లక్షలు కాగా, బ్రెజా ధర రూ.8.26 లక్షల నుండి మొదలవుతుంది. టాప్ మోడల్ విషయానికి వస్తే, నెక్సాన్ (రూ.13.79 లక్షలు) బ్రెజా (రూ.12.86 లక్షలు) కంటే కొంచెం ఎక్కువ ధర కలిగి ఉంది. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి నెక్సాన్ బెస్ట్ ఆప్షన్. అయినప్పటికీ, బ్రెజా లో మెయింటెనెన్స్ ఖర్చు, బలమైన రీసేల్ విలువ దీర్ఘకాలంలో ఆఫీస్ యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
రోజువారీ ట్రాఫిక్‌లో సులభమైన డ్రైవింగ్ కోసం ఇంజిన్ కెపాసిటీ కూడా ముఖ్యమే. మారుతి బ్రెజా 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో వస్తుంది. బ్రెజా డ్రైవింగ్ పట్టణ ప్రాంతాల్లో, ట్రాఫిక్‌లో చాలా స్మూత్‌గా, రిఫైన్డ్‌గా, వైబ్రేషన్ లేకుండా ఉంటుంది. ఇది రోజువారీ డ్రైవింగ్‌కు అనుకూలమైనది.
టాటా నెక్సాన్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో (పెట్రోల్/డీజిల్) లభిస్తుంది. రెండు ఇంజిన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, డీసీటీ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ టర్బో ఇంజిన్ హైవేలపై ఓవర్‌టేకింగ్‌కు, మరింత పవర్ కోసం చూసే వారికి మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
మైలేజ్ విషయంలో మారుతి బ్రెజా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. మారుతి బ్రెజా పెట్రోల్ వెర్షన్ 19.8 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది. అత్యంత ముఖ్యంగా, దీని సీఎన్‌జీ వెర్షన్ 25.51 కి.మీ/కేజీ వరకు మైలేజ్‌ను అందించి, రోజువారీ వినియోగదారులకు చాలా పొదుపుగా ఉంటుంది. టాటా నెక్సాన్ పెట్రోల్ వెర్షన్ 17–18 కి.మీ/లీ మైలేజ్ ఇవ్వగా, డీజిల్ వెర్షన్ 24.08 కి.మీ/లీ వరకు మైలేజీని అందిస్తుంది.
ఫీచర్లు, భద్రత విషయంలో నెక్సాన్ మెరుగ్గా ఉంది. నెక్సాన్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా మరియు జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. బ్రెజాలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో టాటా నెక్సాన్ ముందంజలో ఉంది. దీనికి గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ రెండింటి నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో ఏడీఏఎస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. మారుతి బ్రెజాకు 4-స్టార్ రేటింగ్ లభించింది. బ్రెజాలో కూడా ఇప్పుడు అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందించబడుతున్నాయి, అయినప్పటికీ, మొత్తం భద్రతలో నెక్సాన్ కొద్దిగా మెరుగైనది.
