ఒక్క నెలలో 20 వేలకు పైగా యూనిట్ల అమ్మకం

Sedan Sales : భారతీయ మార్కెట్‌లో ఎప్పటి నుంచో సెడాన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా గత నెల అంటే అక్టోబర్ 2025లో జరిగిన అమ్మకాల లెక్కలు చూస్తే మరోసారి మారుతి సుజుకి డిజైర్ తన నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ కారుకు కేవలం రూ.7 లక్షల లోపు బడ్జెట్‌లో లభించడమే కాకుండా 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వడం దీని విజయానికి ప్రధాన కారణం. గత నెలలో డిజైర్ ఏకంగా 20,791 యూనిట్ల విక్రయంతో సంచలనం సృష్టించింది. దీని అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 64 శాతం పెరిగాయి. ఈ సెడాన్ విభాగంలో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

మారుతి సుజుకి డిజైర్ అమ్మకాల పరంగా టాప్‌లో ఉంది. అక్టోబర్ 2024 లో 20,791 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 64 శాతం పెరిగాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.21 లక్షల నుంచి రూ.9.31 లక్షల వరకు ఉంది. ఈ కారు పెట్రోల్‌పై 22 కి.మీ., సీఎన్‌జీ పై దాదాపు 34 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ జాబితాలో హ్యుందాయ్ ఆరా రెండో స్థానంలో నిలిచింది. ఇది గత నెలలో 21 శాతం వృద్ధితో మొత్తం 5,815 యూనిట్లను విక్రయించింది. హోండా అమేజ్ మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు ఏకంగా 52 శాతం పెరిగి, మొత్తం 3,630 యూనిట్లు అమ్ముడయ్యాయి. వోక్స్‌వ్యాగన్ వర్టస్ 4 శాతం వృద్ధితో మొత్తం 2,453 యూనిట్ల విక్రయంతో నాలుగో స్థానంలో ఉంది. స్కోడా స్లావియా 1 శాతం వృద్ధితో మొత్తం 1,648 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానం దక్కించుకుంది.

అమ్మకాల జాబితాలో ఆరో స్థానం నుంచి పది స్థానాల్లో ఉన్న కార్ల వివరాలు చూస్తే.. టాటా టిగోర్ 29 శాతం వృద్ధితో మొత్తం 1,196 యూనిట్లను విక్రయించి ఆరో స్థానంలో నిలిచింది. ఏడో స్థానంలో ఉన్న హ్యుందాయ్ వెర్నా అమ్మకాలు 35 శాతం భారీగా తగ్గాయి. ఇది కేవలం 824 యూనిట్లు మాత్రమే అమ్మింది. హోండా సిటీ అమ్మకాలు కూడా 42 శాతం పడిపోయాయి. ఇది 578 యూనిట్లు మాత్రమే విక్రయించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. టయోటా కామ్రీ అమ్మకాలు 57 శాతం పెరిగి, మొత్తం 276 యూనిట్ల అమ్మకాలతో 9వ స్థానంలో నిలిచింది. అమ్మకాల జాబితాలో మారుతి సుజుకి సియాజ్ పదో స్థానంలో ఉన్నా, గత నెలలో దీనికి ఒక్క కస్టమర్ కూడా లభించలేదు (0 యూనిట్లు).

PolitEnt Media

PolitEnt Media

Next Story