టర్బో వేరియంట్‌పై బెస్ట్ ఆఫర్

Maruti Fronx : జీఎస్టీ తగ్గింపుల తర్వాత మారుతి సుజుకి కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ఫలితంగా సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరిగాయి. మారుతి వద్ద దాదాపు రెండున్నర లక్షల కార్ల ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉండగా వాటిని పూర్తి చేయడానికి కంపెనీ శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి తన కార్లపై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా టాటా నెక్సాన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర మరింత తగ్గింది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు జీఎస్టీ తగ్గింపు కారణంగా ఇప్పటికే సుమారు రూ.1,12,600 చౌకగా మారింది. ఇప్పుడు, కంపెనీ దీపావళి పండుగ సందర్భంగా అదనంగా రూ.88,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, కొనుగోలుదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు ఈ అదనపు ఆఫర్ కూడా లభిస్తుంది. ఫ్రాంక్స్ కారు టర్బో వేరియంట్‌లపై అత్యధికంగా రూ.88,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ మొత్తం ప్రయోజనంలో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 స్క్రాపేజ్ బోనస్, రూ.43,000 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీస్. అంతేకాకుండా, 1.2-లీటర్ పెట్రోల్ వేరియంట్లపై రూ.22,000 నుంచి రూ.39,000 వరకు సీఎన్‌జీ మోడళ్లపై రూ.30,000 వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి తన అన్ని మోడళ్లపై పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రూ.1.80 లక్షల వరకు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 22, 2025న కొత్త జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తరువాత లభించే తగ్గింపులకు ఇవి అదనం. ఈ ఆఫర్లు ఎరీనా, నెక్సా డీలర్‌షిప్‌లలో లభిస్తున్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఫ్రాంక్స్.. పర్ఫార్మెన్స్, లుక్, ఫీచర్ల అద్భుతమైన కలయికగా పేరు పొందింది. 1.0 లీటర్ టర్బో ఇంజిన్ 99 బీహెచ్‌పీ పవర్, 147.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 21.5 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది. డ్యూయల్-టోన్ ఇంటీరియర్, 9-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో దీన్ని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story