Maruti Grand Vitara : ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 1200కిమీ..మారుతి గ్రాండ్ విటారా మైలేజ్ కి కస్టమర్లు ఫిదా
మారుతి గ్రాండ్ విటారా మైలేజ్ కి కస్టమర్లు ఫిదా

Maruti Grand Vitara : మారుతి సుజుకి నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో.. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సత్తా ఈ కారుకు ఉంది. అంటే మీరు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేయొచ్చన్నమాట. ఇంతటి అదిరిపోయే మైలేజీ ఇచ్చే ఈ కారును ఎంత తక్కువ డౌన్ పేమెంట్ కి ఇంటికి తీసుకెళ్లొచ్చో, ఈ ఫైనాన్స్ లెక్కలేంటో చూద్దాం.
ధర, ఆన్-రోడ్ ఖర్చు: మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ ప్రారంభ ధర రూ.16.63 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, దీనికి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర సుమారు రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. మీరు ఎంచుకునే వేరియంట్, నగరాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.
తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్: గ్రాండ్ విటారా డెల్టా ప్లస్ (హైబ్రిడ్) వేరియంట్‌ను ఫైనాన్స్ ద్వారా తీసుకోవాలనుకుంటే, సుమారు రూ.4 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. మిగిలిన రూ.15 లక్షల మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ బ్యాంక్ 9 శాతం వడ్డీతో 5 ఏళ్ల కాలపరిమితికి లోన్ ఇస్తే, మీరు ప్రతి నెలా దాదాపు రూ. 31,000 వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నెలవారీ జీతం రూ.60 వేల నుంచి రూ.70 వేల మధ్య ఉంటే, ఈ కారును ఫైనాన్స్‌లో తీసుకోవడం మీకు సులువైన పనే.
సేఫ్టీలో రాక్ స్టార్ : మారుతి ఈసారి సేఫ్టీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. గ్రాండ్ విటారాలోని అన్ని వేరియంట్లలో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్‌లను స్టాండర్డ్గా అందిస్తోంది. అంటే బేస్ మోడల్ కొన్నా మీకు పూర్తి రక్షణ లభిస్తుంది. దీనితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ABS విత్ EBD, పిల్లల సేఫ్టీ కోసం ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
1200 కిలోమీటర్ల రేంజ్ ఎలా సాధ్యం?
గ్రాండ్ విటారా హైబ్రిడ్ కారులో 45 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇది లీటరుకు సుమారు 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ లెక్కన ట్యాంక్ ఫుల్ చేస్తే థియరిటికల్‌గా 1250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లొచ్చు. రియల్ లైఫ్ లో ట్రాఫిక్ పరిస్థితులను బట్టి చూసినా, సులభంగా 1200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. మైలేజీ గురించి ఆలోచించే వారికి మార్కెట్లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్.

