అదిరిపోయే హైబ్రిడ్ కార్లు ఇవే

Hybrid Cars : భారత మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా హైబ్రిడ్ కార్ల అమ్మకాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా హైబ్రిడ్ కార్లను విడుదల చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కొత్త హైబ్రిడ్ కారు కొనే ఆలోచనలో ఉంటే కాస్త ఆగండి. 2026-27 మధ్య నాలుగు ప్రధాన వాహన తయారీ సంస్థలు మారుతి సుజుకి , హ్యుందాయ్, కియా, రెనాల్ట్ తమ హైబ్రిడ్ కార్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నాయి.

మారుతి మినీ ఎంపీవీ

మారుతి సుజుకి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 2026 ప్రారంభంలో ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాసోవర్‌లో మొదటగా వస్తుంది. కొత్త తరం బలెనో, మారుతి కొత్త మినీ ఎంపీవీ కూడా ఈ కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తాయి. వీటిని 2026లో లాంచ్ చేయవచ్చు. కొత్త మారుతి కాంపాక్ట్ ఎంపీవీ స్పేషియా వలె నిటారుగా, బాక్సీ ఆకారంలో ఉంటుంది. అయితే, ఇందులో స్పేషియా వెనుక డోర్లు, ADAS వంటి కొన్ని ఫీచర్లు ఉండవు. ఈ ఎంపీవీలో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఉంటుంది, ఇది లీటరుకు 35 కి.మీ. కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని అంచనా.

కియా సెల్టోస్ హైబ్రిడ్

రెండవ తరం కియా సెల్టోస్ డిజైన్‌లో చాలా మార్పులు వస్తాయని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే స్పోర్టేజ్ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొందింది. క్యాబిన్‌ను కూడా అనేక కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేస్తారు. వాటిలో కొన్ని కియా సైరోస్ నుండి తీసుకోవచ్చు. 2026 కియా సెల్టోస్ ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లతో పాటు 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా పొందుతుంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కేవలం హై ట్రిమ్స్‌లో మాత్రమే రావొచ్చు.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్

మూడవ తరం రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో లాంచ్ అవుతుంది. పెట్రోల్ వేరియంట్లలో 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ లేదా 1.3 లీటర్ టర్బో ఇంజిన్‌లు ఉండవచ్చు. హైబ్రిడ్ వేరియంట్‌లో 94 bhp ఉన్న 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.2 kW బ్యాటరీ ఉండవచ్చు. దీని పవర్ అవుట్‌పుట్ దాదాపు 140 bhp ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్

SX3 కోడ్‌నేమ్ గల తదుపరి తరం హ్యుందాయ్ క్రెటా 2027లో లాంచ్ అవుతుంది. కొత్త సెల్టోస్ లాగే, 2026 హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్‌లో 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ సెటప్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుత 115 bhp 1.5 లీటర్ పెట్రోల్, 160 bhp 1.5 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్, 116 bhp 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌లు కొనసాగుతాయి. ఈ ఎస్‌యూవీ సరికొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్‌లో కూడా అప్‌డేట్‌లు కనిపిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story