Maruti : మారుతి సుజుకి బంపర్ ఆఫర్..లక్ష రూపాయల పైనే డిస్కౌంట్..ఈ అవకాశం మిస్ చేసుకోకండి
ఈ అవకాశం మిస్ చేసుకోకండి

Maruti : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈ మార్చి నెలలో కస్టమర్ల కోసం అదిరిపోయే పండగ ఆఫర్లను తీసుకువచ్చింది. తమ ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ నెక్సా ద్వారా విక్రయించే పాపులర్ కార్లపై ఏకంగా రూ.1.05 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు స్టాక్‌ను క్లియర్ చేయడంలో భాగంగా ఇగ్నిస్, బాలెనో, ఫ్రాంక్స్ వంటి మోడళ్లపై ఈ బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం నగదు తగ్గింపు మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో కూడా లాభం పొందవచ్చు. ఈ ఆఫర్లు మార్చి 31 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి.
మారుతి సుజుకి XL6
ఈ నెల ఆఫర్లలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మారుతి సుజుకి XL6. ఈ ప్రీమియం ఎంపీవీ పై కంపెనీ గరిష్టంగా రూ.1.05 లక్షల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇందులో రూ.75,000 వరకు కన్స్యూమర్ ఆఫర్ ఉండగా, మిగిలిన మొత్తాన్ని ఇతర బెనిఫిట్స్ రూపంలో పొందవచ్చు. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి, లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన సమయం. ప్రస్తుతం మార్కెట్లో XL6 ప్రారంభ ధర రూ.11.52 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
మారుతి సుజుకి జిమ్నీ
మారుతి సుజుకి తన ఐకానిక్ ఆఫ్-రోడర్ జిమ్నీపై కూడా భారీ తగ్గింపును ప్రకటించింది. గరిష్టంగా రూ.80,000 వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందులో రూ.75,000 నగదు తగ్గింపు ఉండటం విశేషం. పర్వత ప్రాంతాలు, కఠినమైన దారుల్లో ప్రయాణించేందుకు ఇష్టపడే అడ్వెంచర్ ప్రియులకు ఈ ఆఫర్ ఒక వరంలాంటిది. ప్రస్తుతం జిమ్నీ ప్రారంభ ధర రూ.12.32 లక్షల వద్ద ఉంది.
బడ్జెట్ కార్లపై కూడా భారీ రాయితీలు
మారుతి సుజుకి తన బడ్జెట్, పాపులర్ మోడళ్లపై కూడా కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
మారుతి సుజుకి ఇగ్నిస్: ఈ చిన్న కారుపై రూ.42,500 వరకు తగ్గింపు లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.5.35 లక్షలు.
మారుతి సుజుకి బాలెనో : దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హ్యాచ్‌బ్యాక్ బాలెనో పై రూ.35,000 వరకు డిస్కౌంట్ ఉంది. దీని ధర రూ.5.63 లక్షల నుంచి మొదలవుతుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్: వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌పై రూ.25,000 వరకు సేవింగ్స్ పొందవచ్చు. దీని ప్రారంభ ధర రూ.6.85 లక్షలు.
మరిన్ని వివరాల కోసం, మీ నగరంలో ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరలు తెలుసుకోవడానికి మీ దగ్గరలోని మారుతి నెక్సా డీలర్‌షిప్‌ను వెంటనే సంప్రదించండి. ఈ ఆఫర్లు వేరియంట్, రంగును బట్టి మారవచ్చు.

